- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్.. గోల్కొండ ఘటన బాధేసింది : మాజీ డిప్యూటీ సీఎం
అజారుద్దీన్ మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి, ఫయూమ్ ఖురేషీ మైనారిటీ గురుకులాల వైస్ చైర్మన్‌గా ఉన్నా మైనారిటీ గురుకులాలు నిర్వీర్యం అయ్యాయని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అజారుద్దీన్ మైనారిటీ వెల్ఫేర్ శాఖ మంత్రి, ఫయూమ్ ఖురేషీ మైనారిటీ గురుకులాల వైస్ చైర్మన్‌గా ఉన్నా మైనారిటీ గురుకులాలు నిర్వీర్యం అయ్యాయని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ అన్నారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీది ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని విమర్శించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు గురుకులాలు ప్రథమ స్థానంలో నిలిచాయని తెలిపారు. గోల్కొండ మైనారిటీ జూనియర్ కాలేజీలో ఒక బాలిక ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయిందని.. కాలేజీ ప్రిన్సిపాల్, వార్డెన్ ఈ విషయాన్ని పట్టించుకోలేదని ఆరోపించారు. పురిట్లోనే పసి బిడ్డను చంపారని.. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గోల్కొండ మైనారిటీ జూనియర్ కాలేజీలో జరిగిన ఘటనను ప్రభుత్వం దాచిపెట్టిందన్నారు. గతంలోనూ మైనారిటీ గురుకుల పాఠశాలలో ఒక బాలిక మరణించిందని తెలిపారు. దీనిపై సీఎం, విద్యా శాఖ మంత్రి, డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. గోల్కొండ మైనారిటీ జూనియర్ కాలేజీలో జరిగిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.






