- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వడదెబ్బతో ఆరేళ్ల చిన్నారి మృతి..
దంచికొడుతున్న ఎండలు ఆరేళ్ల అమాయక ప్రాణాన్ని బలి తీసుకున్నాయి.

దిశ, కంగ్టి: భగభగ మండుతున్న ఎండలు మరో అమాయక ప్రాణాన్ని బలి తీసుకున్నాయి. సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలోని చౌకన్‌పల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారి శైలజ వడదెబ్బకు మృతి చెందిన విషాద ఘటన మంగళవారం వెలుగుచూసింది. ఉపాధి హామీ పనులకు వెళ్లే మర్రి లక్ష్మణ్, శారద దంపతులు ఈ నెల 4న కూడా తమ కూతురు శైలజను వెంట తీసుకెళ్లారు. తల్లిదండ్రులు పనుల్లో నిమగ్నమై ఉండగా, చిన్నారి మండుతున్న ఎండలోనే ఆడుకుంటూ ఉండిపోయింది.
ఎండ తీవ్రతను తట్టుకోలేకనే..
పనులు జరుగుతున్న ప్రదేశంలో కూలీలకు సరైన నీడ సదుపాయం లేకపోవడం చిన్నారి ప్రాణాలకు ప్రమాదంగా మారింది. ఎండ తీవ్రతను తట్టుకోలేక తీవ్ర నీరసానికి గురైన శైలజ, రాత్రి తల్లిదండ్రుల పక్కనే నిద్రపోయి… మంగళవారం తెల్లవారుజామున శాశ్వత నిద్రలోకి జారుకుంది. తమతో పాటు ఆనందంగా పనికి వచ్చిన కూతురు ఇలా ప్రాణాలు కోల్పోవడం తల్లిదండ్రులను కన్నీటి పర్యంతం చేసింది. గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటనపై ఏపీఓ బసవరాజును ‘దిశ’ ప్రతినిధి ప్రశ్నించగా, చిన్నారి వడదెబ్బతో మృతి చెందిన విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు.






