- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ కి సిట్ నోటీసులు.. బీఆర్ఎస్ శ్రేణుల అగ్రహారం
మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద సిద్దిపేట -

దిశ, నంగునూరు : మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు అందజేయడాన్ని నిరసిస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాంపూర్ క్రాసింగ్ వద్ద సిద్దిపేట - హన్మకొండ జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా సిఎం డౌన్ డౌన్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సిఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని దగ్దం చేశారు. అనంతరం రాజగోపాల్పేట పోలీసులు అక్కడికి చేరుకొని కార్యకర్తలను సముదాయించి రాస్తారోకో వీరామింప చేశారు. సిట్ నోటీసుల పేరిట కాంగ్రెస్ గవర్నమెంట్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని మాజీ ఎంపిపి జాప శ్రీకాంత్ రెడ్డి, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య ఆరోపించారు. హామీల అమలు చేతకాక ప్రశ్నించే ప్రతిపక్ష నేతలకు సిట్ విచారణ పేరిట నోటీసులు ఇవ్వడం సిగ్గుమాలిన పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ గవర్నమెంట్ బొగ్గు గనుల బాగోతాన్ని హరీష్ రావు బట్టబయలు చేయడంతో హరీష్ రావు తో పాటు మాజీ సిఎం కెసిఆర్ కు, కేటీఆర్ కు సిట్ విచారణ పేరిట నోటీసులు ఇస్తూ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని అన్నారు. ఆరు గ్యారెంటీల అమలు చేతకాక సిట్ నోటీసులు ఇచ్చి కాంగ్రెస్ కొత్త డ్రామాకు తెరలేపుతుందని అన్నారు. రైతులకు రైతు భరోసా, యూరియా, ఎరువులు, సరిపడేంత కరెంట్ అందజేయాలని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు రమేష్ గౌడ్, కిష్టారెడ్డి, కమల్ షరీఫ్, దువ్వల మల్లయ్య, బెదురు తిరుపతి, రంగు రాజు, వేణు చారి, పలువురు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.






