- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొమురవెల్లిలో వందేమాతరం గీతాలాపన
దిశ, కొమురవెల్లి : వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపు మేరకు బీజేపీ

దిశ, కొమురవెల్లి : వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలో సామూహిక వందేమాతరం గీతాలాపన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రధాని మోడీ పిలుపు మేరకు బీజేపీ ఆధ్వర్యంలో శనివారం కొమురవెల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి సామూహిక వందేమాతర గీతాలాపన చేశారు. ఈ సందర్బంగా జనగామ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు దండ్యాల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ బంకీంచంద్ర ఛటర్జీ చేతిలో పురుడోసుకున్న వందేమాతరం లక్షలాదిమంది ధేశ భక్తులకు తారకమంత్రం లాగా పనిచేసి, స్వాతంత్ర సంగ్రామ మహోద్యమంలో ముందుండి పోరాడే విధంగా స్పూర్తిగా నిలిచిందని తెలిపారు. వందేమాతరంను ప్రతి ఒక్కరూ విధిగా ఆలపించి స్వాతంత్ర సంగ్రామ మహోద్యమంలో దేశ మాత విముక్తికోసం బలిదానాలు చేసుకున్న అమరవీరులకు నివాళులు అర్పించాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు, బీజేపీ సీనియర్ నాయకులు దండ్యాల బిక్షపతిరెడ్డి, సీనియర్ నాయకులు నాగరాజు, ఎక్కలదేవి శ్రీనివాస్, రాజుచారి, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.






