ఎర్లీ బర్డ్ @ 25.76 శాతం

by Batti.Sumithra |

రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న సిద్దిపేట మున్సిపాలిటీ పన్ను వసూల్లో సైతం జిల్లాలో ప్రథమ స్థానంలో కొనసాగుతుంది.

ఎర్లీ బర్డ్ @ 25.76 శాతం
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులను దక్కించుకున్న సిద్దిపేట మున్సిపాలిటీ పన్ను వసూల్లో సైతం జిల్లాలో ప్రథమ స్థానంలో కొనసాగుతుంది. శత శాతం పన్ను వసూలే లక్ష్యంగా 2026-27 ఆర్ధిక సంవత్సరం ప్రథామార్థంలో అస్తి పన్నులో 5 శాతం రాయితీతో అమలు చేసిన ఎర్లీ బర్డ్ స్కీంకు పట్టణ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 2026 ఏప్రిల్ 1 నుంచి 30 వరకు 5 శాతం రాయితీ పై ఆస్తి పన్ను చెల్లింపుకు అవకాశం కల్పించడంతో మంగళవారం నాటికి సిద్దిపేట బల్దియాకు 25.76 శాతం పన్ను వసూలై రూ. 4 కోట్ల 82 లక్షలు సమకూరింది. సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 43 వార్డులు ఉన్నాయి.

అయా వార్డుల్లో పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి 37,539 గృహ సముదాయాల ను అధికారులు గుర్తించారు. అందులో 32,297 గృహ సముదాయాలు, 2263 వాణిజ్య సముదాయాలు, 2887 గృహ, వాణిజ్య సముదాయాలు కలిసి ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు మినహా మున్సిపాలిటీ పరిధిలో 37,447 గృహ వాణిజ్య సముదాయాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. వీటికి గాను రూ. 22 కోట్ల 53 లక్షలు, ప్రభుత్వం భవనాలు తీసివేస్తే 17 కోట్ల 94 లక్షలు డిమాండ్ ఉంది. ప్రభుత్వ భవనాలు తీసివేస్తే ఏప్రిల్ 1వ తేది నుంచి 28వ తేది వరకు 4 కోట్ల 82 లక్షలు అనగా 25.76 శాతం పన్ను వసూలైంది. 5 శాతం రాయితీ పై మరో రెండు రోజులు మాత్రమే ఆస్తీ పన్ను చెల్లించే వీలు ఉంది. ఈ ఆర్ధిక సంవత్సరం ప్రథమార్ధంలో జిల్లాలో ఎంత శాతం ఎర్లీ బర్డ్ స్కీంలో బల్దియాలకు ఆదాయం సమకూరనుందో చూడాలి మరీ.

గత రెండు ఆర్ధిక సంవత్సరాల్లో ఇలా..

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో రెండు సంవత్సరాలుగా పన్ను వసూలు 70 శాతం పైగా వసూలు అవుతున్నాయి. 2025- 26 ఆర్ధిక సంవత్సరానికి డిమాండ్ రూ. 23 కోట్ల 26 లక్షలు కాగా రూ 16 కోట్ల 98 లక్షలు( 73 శాతం) వసూలైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి డిమాండ్ రూ.20 కోట్ల 48 లక్షలు కాగా రూ. 14 కోట్ల 73 లక్షలు (71.96 శాతం) వసూలైంది.

ప్రభుత్వ సముదాయాలకు సంబంధించి..

సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 92 ప్రభుత్వ భవనాలను అధికారులు గుర్తించారు. వీటికి సంబంధించి రూ.4 కోట్ల 59 లక్షలు డిమాండ్ కాగా ఎర్లీ బర్డ్ స్కీం లో రూ. 21లక్షలు వసూలైంది. కాగా 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రూ. 4 కోట్ల 56 లక్షలు డిమాండ్ కాగా రూ.83 లక్షలు వసూలైంది.

మున్సిపాలిటీ డిమాండ్ ఎర్లీ బర్డ్ స్కీంలో శాతం

సిద్దిపేట రూ. 22 కోట్ల 53 లక్షలు రూ. 4 కోట్ల 82 లక్షలు 25.76 శాతం

చేర్యాల రూ. 1 కోటి 53 లక్షలు రూ. 27 లక్షలు 9.9 శాతం

గజ్వేల్ రూ. 7 కోట్ల 54 లక్షలు రూ. 60 లక్షలు 5 శాతం

దుబ్బాక రూ. 2 కోట్ల 8 లక్షలు రూ. 28 లక్షల 71 వేలు 13.79 శాతం

హుస్నాబాద్ రూ. 1కోఠి 93 లక్షలు రూ. 21 లక్షలు 6.51 శాతం

Next Story