- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘ఆధ్యాత్మిక సేవకు ప్రతీక సిద్దిపేట’: మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు
by Kodari Anjali |
ఆధ్యాత్మిక సేవకు ప్రతీక సిద్దిపేట అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.

X
దిశ, సిద్దిపేట అర్బన్: ఆధ్యాత్మిక సేవకు ప్రతీక సిద్దిపేట అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల గ్రౌండ్‌లో హనుమాన్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో జరుగుతున్న భవిష్యత్ బ్రహ్మ హనుమాన్ సిద్ది మహా యాగం కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... హనుమాన్ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ దుర్గా ప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఈ యాగం జరగడం సంతోషంగా ఉందన్నారు. సిద్దిపేట మట్టికి ఒక మహత్యం ఉంది. ఇక్కడ ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఆ కార్యక్రమం గమ్యాన్ని చేరుతుందని అన్నారు. అమర్‌నాథ్ కేదారనాథ్ అయోధ్యతో పాటు దేశంలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో సిద్దిపేట భక్తుల సేవలు అందించడం గర్వంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Next Story






