దిశ ఎఫెక్ట్ ...అక్రమ రియల్ వ్యాపారులకు షాక్

by velandi.Saikiran |

జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 243లో ప్రభుత్వం కేటాయించిన సాగు భూముల్లో, గత కొన్ని

దిశ ఎఫెక్ట్ ...అక్రమ రియల్ వ్యాపారులకు షాక్
X

దిశ, గుమ్మడిదల : జిన్నారం మండలం బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని సర్వే నంబర్ 243లో ప్రభుత్వం కేటాయించిన సాగు భూముల్లో, గత కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్లాట్ల దందా మొదలుపెట్టారు. పేపర్‌పై లేఅవుట్ సృష్టించి, భూములను ప్లాట్లుగా చూపిస్తూ అమాయక ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నించారు. వీరు సర్కారు భూములపై కూడా అక్రమ అమ్మకాల ప్రయత్నాలు చేశారు. ఈ వ్యవహారంపై ఆగస్టు 9న దిశ పత్రికలో ‘పేపర్‌పై గీతలు.. సర్కారు భూములు అమ్మకాలు’ శీర్షికతో కథనం వెలువడింది. ఈ వార్తతో కలకలం రేపింది.

అధికారులు ఈ విషయం పై విచారణ చేపట్టారు. శనివారం మండల తహసిల్దార్ దేవదాస్ ఆదేశాల మేరకు ఆర్ఐ జయప్రకాశ్ నారాయణ సదరు భూమిలో “ప్రభుత్వ భూమి” బోర్డును ఏర్పాటు చేశారు. ఇకపై ఈ భూములను కబ్జాకు ప్రయత్నించిన, అక్రమంగా విక్రయాలు జరిపిన కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యతో అక్రమార్కులకు చెక్ పడింది, అమాయక ప్రజలు మోసపోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసినట్లు అధికారులు తెలిపారు.

Next Story