- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లింగ నిర్ధారణ నేరం.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టడం, పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు

దిశ, సంగారెడ్డి అర్బన్: గర్భస్థ శిశువు లింగ నిర్ధారణను అరికట్టడం, పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం లక్ష్యంగా జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా వైద్య ,ఆరోగ్య శాఖ అధికారి డా. కె. లలితాదేవి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వైద్య నిపుణులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో స్కానింగ్ కేంద్రాల పనితీరు, చట్టం అమలు, రికార్డుల నిర్వహణ, గర్భిణులకు అందిస్తున్న వైద్య సేవలు, లింగ నిర్ధారణ నిషేధానికి సంబంధించిన నిబంధనలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా డీఎం అండ్ హెచ్ ఓ మాట్లాడుతూ.. గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ చేయడం లేదా ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని తెలిపారు. పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టాన్ని ప్రతి స్కానింగ్ కేంద్రం తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలు కూడా చట్టంపై అవగాహన పెంపొందించుకుని, ఎక్కడైనా లింగ నిర్ధారణకు సంబంధించిన అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం అందించాలని కోరారు. మహిళా శిశు సంరక్షణ, బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.






