- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టిమ్స్ కు పలువురు డాక్టర్ల బదిలీ
by Taduka Kalyani |
నూతనంగా ప్రారంభించనున్న సనత్ నగర్ లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టీమ్స్)కు సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రభుత్వ డాక్టర్లు బదిలీ అయ్యారు.

X
దిశ, సంగారెడ్డి : నూతనంగా ప్రారంభించనున్న సనత్ నగర్ లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టీమ్స్)కు సంగారెడ్డి జిల్లాకు చెందిన పలువురు ప్రభుత్వ డాక్టర్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం పనిచేస్తున్న డాక్టర్ కెఎంకె.రెడ్డి (కార్డియాలజీ), డాక్టర్ ఎస్.ఆనంద్ (యూరాలజీ), డాక్టర్ బి. అర్చన (న్యూరాలజీ), డాక్టర్ ఎన్.ప్రతాప్ (న్యూరో సర్జరీ, డాక్టర్ ఏ. వెంకటేశ్వరరావు (న్యూరో సర్జరీ), డాక్టర్ సయ్యద్ ఇబ్రహీం జుబెర్ (అసిస్టెంట్ అనస్తీషియా) విభాగాలకు చెందిన వైద్యులు టిమ్స్ కు బదిలీ అయ్యారు. బదిలీ అయిన వారంతా అక్కడ డిప్యూటేషన్ పై తమ సేవలను కొనసాగిస్తారు.
Next Story






