ఆఫీస్‌లోనే సెటిల్మెంట్ దందా.. ఒక్కొక్కరూ వచ్చి పర్సంటేజ్ పై చర్చలు

by Ajay Maddhiboyina |

వెలుగుల శాఖలో అవినీతి చీకటి కమ్ముకుంటుంది. అధికా రం ఉంది మామూళ్లు వసూల్ చేసేందుకే అన్నట్టుగా మార్చేస్తున్నారు. గత యేడు అక్టోబర్లో అవినీతి జలగగ మారిన మెదక్ ట్రాన్స్ కో డీఈ అవినీతి నిరోధక శాఖకు చిక్కి కటకటాల పాలై ఏడాది గడవక ముందే అదే శాఖలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి పట్టుబడింది.

ఆఫీస్‌లోనే సెటిల్మెంట్ దందా.. ఒక్కొక్కరూ వచ్చి పర్సంటేజ్ పై చర్చలు
X

దిశ, మెదక్ ప్రతినిధి: వెలుగుల శాఖలో అవినీతి చీకటి కమ్ముకుంటుంది. అధికారం ఉంది మామూళ్లు వసూల్ చేసేందుకే అన్నట్టుగా మార్చేస్తున్నారు. గత యేడు అక్టోబర్లో అవినీతి జలగగా మారిన మెదక్ ట్రాన్స్ కో డీఈ అవినీతి నిరోధక శాఖకు చిక్కి కటకటాల పాలై ఏడాది గడవక ముందే అదే శాఖలో మరో అవినీతి తిమింగలం ఏసీబీకి పట్టుబడింది. సదరు అధికారిపై అనేక విమర్శలు వచ్చినా సంబంధిత శాఖ పెడచెవిన పట్టడం విద్యు త్ శాఖకు మరో అవినీతి మచ్చ పడింది. మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ శాఖ అడిషనల్ డివిజన్ ఇంజనీర్ రమణారెడ్డి ఓ కాంట్రాక్టర్ చేసిన పనుల డబ్బు మంజూ రు కోసం వెళ్లగా రూ.30 వేలు ఇస్తేనే చేస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించి డబ్బు ఇస్తుండగా పట్టుకొని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నర్సాపూ ర్ ట్రాన్స్ కో ఏడీఈగా రమణారెడ్డి బాధ్యత లు చేపట్టి దాదాపు ఏడాది మాత్రమే అవుతోంది. విధుల్లోకి వచ్చిన నాటి నుంచే అవినీతి సొమ్ముపైనే దృష్టి పట్టి కాంట్రాక్టర్లు, రైతులను డబ్బు కోసం పీల్చుకు తిన్నట్లు విమర్శలు ఉన్నాయి.

రియల్ ఎస్టేట్ ఆఫీస్‌గా కార్యాలయం..?

ఏసీబీకి పట్టుబడిన ఏడీఈ విద్యుత్ కార్యాలయంలా కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థగా నడిపించినట్టు పలువురు రైతులు వాపోతున్నారు. సార్ ను వెళ్లి కలవాలంటే ముందుగా ఎవరు వచ్చారు.. ఎందుకు వచ్చారు చెబితే వారి పనిని పట్టి లోపలికి అనుమతి వచ్చింది. మామూళ్లు, పనుల పర్సంటేజ్ ఇచ్చే వాళ్లకు మాత్రం ముందు గా అనుమతి ఇచ్చి తర్వాత రైతులు, ఇతర విషయాలు చర్చించే వారన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రాన్స్ కో కార్యాలయానికి వచ్చిన వారంతా అక్కడ జరిగే సెటిల్మెంట్ లు చూసి ప్రభుత్వ రంగ కార్యాలయానికి వచ్చామా.. లేక రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చామా అనుమానం వ్యక్తం చేసినట్టు పలువురు వాపోతున్నారు. కాంట్రాక్టర్ ల వద్ద కూడా గతంలో ఉన్న పర్సెంటేజీ కంటే ఈ సార్ వచ్చిన తర్వాత మామూళ్లు పెంచినట్టు తెలిసింది. ఏడాది కాలంలోనే సదరు అధికారి లక్షల్లో మామూళ్లు వసూల్ చేసి నర్సాపూర్ లో రికార్డు నమోదు చేసినట్టు ప్రచారం సాగుతోంది. సదరు అధికారి డైరెక్ట్ గా మామూళ్లు వసూళ్లు చేస్తున్న తీరుపై ఆ అధికారికి పలువురు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా విపించుకోలేదని, చేసిన పాపం పండుతుందన్నట్టు చివరకు ఓ కాంట్రాక్ట్ చేతిలో చిక్కి ఏసీబీ వలకు చిక్కాల్సి వచ్చాడని స్థానికంగా చర్చ సాగుతోంది.

జిల్లాలో సాధారణంగా మారిన దాడులు..

మెదక్ జిల్లా కేంద్రంలో ఇటీవల ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న లతీఫ్ ముజాహిద్దీన్ అవినీతికి పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదుతో మార్చి నెలలోనే దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు సదరు అధికారి అవినీతికి పాల్పడినట్లు నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనితో ఆ అధికారిని సంబంధిత శాఖ హెడ్ ఆఫీస్ కు సరెండర్ చేసి శాఖ పరంగా చర్యలు తీసుకున్నారు. అలాగే ట్రాన్స్ కో డీఈ సైతం ఏసీబీ గత అక్టోబర్ లో ఏసీబీకి చిక్కాడు. వెల్దుర్తిలో ఓ రైతు వద్ద లంచం తీసుకుంటూ సర్వేయర్ శ్రీనివాస్ , ప్రొబేషన్ సర్వేయర్ భారత్ గౌడ్ రూ.20 లంచం తీసుకుంటూ ఏసీబీ పట్టుబడ్డారు. అలాగే జిల్లాలో చాలా వరకు అధికారులు ప్రతీ ఆరు నెలల ఒకటి ఏదో విధంగా అవినీతికి పాలపడుతూ ఏసీబీకి చిక్కి కటకటాల పాలు అవుతున్నారు. కానీ, లంచాలు తీసుకోవడం మాత్రం తగ్గడం లేదు. అవినీతికి పాల్పడితే చిక్కుతామన్న భయం మాత్రం కనిపించడం లేదు. ఇప్పటికైనా అధికారులు మారకపోతే కటకాలు మాత్రం తప్పవన్నంట్టు జిల్లాలో జరుగుతున్న ఏసీబీ దాడులు చెబుతున్నాయి.

Next Story