హత్య కేసులో సంచలన తీర్పు

by Ratna Kumari |   (  Updated:2026-05-18 13:47:04  IST  )

బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్య కేసులో ప‌ది మంది నిందుతులకు యావజ్జీవకారాగార (జీవితఖైదు) శిక్ష, ఒక్కొక్కరికి 6500/- రూపాయల జరిమాన విధించినట్లు సోమవారం సిరిసిల్ల జిల్లా ప్రధాననాయమూర్తి నీరజ కీలక తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

హత్య కేసులో సంచలన తీర్పు
X

దిశ ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల : బోయినపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన హత్య కేసులో ప‌ది మంది నిందుతులకు యావజ్జీవకారాగార (జీవితఖైదు) శిక్ష, ఒక్కొక్కరికి 6500/- రూపాయల జరిమాన విధించినట్లు సోమవారం సిరిసిల్ల జిల్లా ప్రధాననాయమూర్తి నీరజ కీలక తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని బోయినపల్లి మండలం స్తంబంపల్లి గ్రామానికి చెందిన తునికి లక్ష్మీనారాయణకి చిన్న కుమారుడు మహేష్ అదే గ్రామానికి చెందిన బొంగానీ పరిశరాములు కూతురు ఒకరికొకరు ప్రేమించుకున్నారు. ఈ విషయం నచ్చని అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు( పది మంది) కలిసి అబ్బాయి వల్ల ఇంటి మీదకి గొడవకి పోయి అబ్బాయి కుటుంబ సభ్యులను కట్టెలతో ఇనుప రాడ్ లతోకొట్టగా అబ్బాయి లక్ష్మీనారాయణకి బాగా గాయాలై చనిపోయాడు.

ఈ కేసులో మృతిని భార్య తునికి విజయ పిర్యాదు మేరకు బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పది మంది నిందుతులను రిమాండ్ కి తరలించారు. అప్పటి వేములవాడ రూరల్ సీఐ నవీన్ కుమార్ కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయగా.. ఈకేసు విచారణ దశలో అదనపు ఎస్పీ చంద్రయ్య పర్యవేక్షణలో వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్, కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ సరేష్ కుమార్ , రాజేంద్ర ప్రసాద్ , కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 20 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున గత పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు. శాస్త్రీయ ఆధారాలు, సాక్ష్యాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో 10 మంది నిందుతులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి 6500/- రూపాయల జరిమానా విధించారు .

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుంచి తప్పించుకోలేరని, శిక్షల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని ఎస్పీ తెలిపారు. పోలీసులు మరియు ప్రాసిక్యూషన్ సమన్వయంతో వ్యూహాత్మకంగా న్యాయ విచారణ, న్యాయ నిరూపణ నిర్వహించి నిందితులకు తప్పనిసరిగా శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.పై కేసుల్లో నిందితులకు శిక్ష పడటంలో కృషి చేసిన అదనపు ఎస్పీ చంద్రయ్య, పీపీలు పెంట శ్రీనివాస్, అప్పటి ,ప్రస్తుత సి.ఐ లు నవీన్ కుమార్, శ్రీనివాస్, సిఎంఎస్ ఎస్‌ఐ రవీందర్ నాయుడు, బోయినపల్లి ఎస్ ఐ రమాకాంత్,కోర్ట్ మానిటరింగ్ కానిస్టేబుల్ నవీన్‌,కోర్టు కానిస్టేబుల్ సరేష్ , రాజేంద్ర ప్రసాద్ లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story