సీనియ‌ర్ కాంగ్రెస్ నేత రామచంద్ర‌ గౌడ్ మృతి

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మెద‌క్ టౌన్ : హవేలీ ఘనపూర్ మండలం మద్దుల్ వాయి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత గుండారం రామచంద్ర‌ గౌడ్ అనారోగ్యం తో మృతి చెందాడు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి

సీనియ‌ర్ కాంగ్రెస్ నేత రామచంద్ర‌ గౌడ్ మృతి
X

దిశ‌, మెద‌క్ టౌన్ : హవేలీ ఘనపూర్ మండలం మద్దుల్ వాయి మాజీ సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నేత గుండారం రామచంద్ర‌ గౌడ్ అనారోగ్యం తో మృతి చెందాడు. కాంగ్రెస్ పార్టీలో జిల్లా స్థాయి పదవుల్లో కొనసాగారు. సొంత గ్రామాల్లో సర్పంచ్ గా గెలిచి గ్రామ అభివృద్ధికి కృషి చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి మృతి చెందాడు. ఆయన మృతి చెందిన విషయం తెలుసుకున్న‌ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ముత్తాయికోట గ్రామానికి చేరుకొని రామచందర్ గౌడ్ పార్థీవదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాజీ సర్పంచ్ కిరణ్ గౌడ్ పరామర్శించి,వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపారు. రామచంద్ర‌ గౌడ్ మృతి పట్ల ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Next Story