- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని అమలు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేసేలా అసెంబ్లీలో చట్టం చేసి అమలు చేయాలని ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు అబ్రహం మాదిగ డిమాండ్ చేశారు

దిశ , జహీరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఉద్యోగ నోటిఫికేషన్ కు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేసేలా అసెంబ్లీలో చట్టం చేసి అమలు చేయాలని ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు అబ్రహం మాదిగ డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణను అన్ని ఉద్యోగ నోటిఫికేషన్ లకు వర్తింపజేయాలని జహీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన దీక్ష చేపట్టారు. ఝరాసంగం మండల అధ్యక్షులు మైకల్ మాదిగ ఆధ్వర్యంలో.. మ్యాతరి.రమేష్ (నేషనల్ హ్యూమన్ రైట్స్ అధ్యక్షులు), వై.అశోక్ కుమార్ (మాజీ సర్పంచ్ కృష్ణాపురం)లు దీక్ష చేపట్టిన నేతలకు పూల మాలలు వేసి 6వ రోజు దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షులు అబ్రహం మాదిగ, జహీరాబాద్ నియోజకవర్గం ఇంఛార్జి ఉల్లాల్ మాదిగ లు మాట్లాడుతూ.. వివేక్ వెంకటస్వామి నేతృత్వంలో మాల ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నాయకులు ముఖ్యమంత్రిని కలిసి ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి నేటికీ కుట్రలు చేస్తుండడం దుర్మార్గమైన చర్య అని అన్నారు.
ఇప్పటికే 70 ఏళ్లుగా ఎస్సీ ఉద్యోగాలన్ని ఏకపక్షంగా దోచుకున్న మాలలు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ జరగకుండా చేసి ఉద్యోగాలన్ని దోచుకుపోవాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ అమల్లో లేకపోతే ఉద్యోగాల్లో మాదిగలకు తీవ్ర అన్యాయం జరుగుతుందనే విషయం సీఎం.రేవంత్ రెడ్డికి స్పష్టంగా తెలిసినప్పటికీ.. మాదిగలకు అన్యాయం చేయాలని చూస్తే మాదిగలు ఊరుకోరన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగేంతవరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఎమ్మార్పిఎస్ ఝారాసంగం మండల నాయకులు తరుణ్, సంసోను, నాగేష్, వినయ్, ప్రవీణ్, వినోద్, అభిషేక్, సందీప్, దయానంద్, నరేష్ మాదిగలు పాల్గొన్నారు.






