గ్రామాభివృద్ధిలో స‌ర్పంచ్ ల పాత్ర కీలకం : క‌లెక్ట‌ర్ కే. హైమావ‌తి

by Nallavelli.Anjaneyulu |

గ్రామాభివృద్ధిలో సర్పంచ్ లు కీలకం అని కలెక్టర్ కే. హైమావతి అన్నారు.

గ్రామాభివృద్ధిలో స‌ర్పంచ్ ల పాత్ర కీలకం : క‌లెక్ట‌ర్ కే. హైమావ‌తి
X

దిశ‌, సిద్ధిపేట ప్ర‌తినిధి : గ్రామాభివృద్ధిలో సర్పంచ్ లు కీలకం అని కలెక్టర్ కే. హైమావతి అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామంలోని న్యాక్ సెంటర్ లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆర్జీఎస్ఏ, టీజీఐఆర్ డీ వారి ఆధ్వర్యం లో నూతనంగా ఎంపికైన గ్రామపంచాయతీ సర్పంచుల ఐదు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టర్ లాంఛనంగా ప్రారంభించారు.ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ మహిళా సర్పంచ్ లు పెత్తనం భర్తల చేతికి అందించకుండా శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగ పరచుకోవాలని సూచించారు. మీ గ్రామంలో ఏం చేయాలి.. ఎలా చేయాలని ఒక ప్రణాళిక రూపొందించుకోవడానికి శిక్షణ తోడ్పడుతుంది అన్నారు. డ్రింకింగ్‌ వాటర్, పారిశుధ్యం, సీసీ రోడ్లు ఒక మొదటి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్ లు గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం అన్ని చూసుకొని ఖర్చు చేసే బాధ్యత సర్పంచ్ లదే అన్నారు. వార్డు సభ్యులు, పంచాయతీ తీర్మానాల ఆధారంగా అభివృద్ధి పనులు పారదర్శకంగా నిర్వహించాలన్నారు. గ్రామంలో నిర్వహించే పలు కార్యక్రమాల తెలియజేసే పలు స్టాల్ లను ప్రారంభించి ప్రతిదీ సర్పంచులకు క్లుప్తంగా అర్థం అయ్యేలా వివరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, డీఆర్డీవో జయదేవ్ ఆర్య, ట్రైనీ డీపీ వో వినోద్ కుమార్, అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

Next Story