ఖరారైన సర్పంచ్‌ల రిజర్వేషన్లు.. పల్లెల్లో ఎన్నికల జోష్

by Naga Rani Yarlagadda |

సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికల కు సంబంధించిన రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేయడంతో పల్లెల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది.

ఖరారైన సర్పంచ్‌ల రిజర్వేషన్లు.. పల్లెల్లో ఎన్నికల జోష్
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికల కు సంబంధించిన రిజర్వేషన్లు అధికారులు ఖరారు చేయడంతో పల్లెల్లో ఎన్నికల సందడి ప్రారంభమైంది. సంగారెడ్డి జిల్లాలో 25 మండలాల పరిధిలోని 613 గ్రామ పంచాయతీలు, వార్డులకు 5370, సిద్దిపేట జిల్లాలో 26 మండలాల పరిధిలోని 508 గ్రామ పంచాయతీలు, 4508 వార్డులకు రిజర్వేషన్లు ఖరారు చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది. సంగారెడ్డి జిల్లాలో 25 మండలాలు 613 గ్రామ పంచాయతీల్లో 283 మహిళా, 330 జనరల్ కేటాయించారు. అందులో ఎస్టీ మహిళా 45, ఎస్టీ జనరల్ 54, ఎస్సీ మహిళా 56, ఎస్సీ జనరల్ 70, బీసీ మహిళా 52, బీసీ జనరల్ 65, అన్ రిజర్వ్ మహిళా 130, అన్ రిజర్వ్ జనరల్ 141 స్థానాలుగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. 5370 వార్డులకు గాను 2404 మహిళా , 2966 జనరల్ కేటాయించారు. అందులో ఎస్టీ మహిళా 353, ఎస్టీ జనరల్ 399, ఎస్సీ మహిళా 480, ఎస్సీ జనరల్ 643, బీసీ మహిళా 464, బీసీ జనరల్ 640, అన్ రిజర్వ్ మహిళా 1107, అన్ రిజర్వ్ జనరల్ 1284 లకు కేటాయిస్తూ రిజర్వేషన్లు ఖరారు చేశారు. అదే విధంగా సిద్దిపేట జిల్లా పరిధిలో 26 మండలాలు 508 గ్రామ పంచాయతీల్లో ఎస్టీ మహిళా 8, ఎస్టీ జనరల్ 14, ఎస్సీ మహిళా 41, ఎస్సీ జనరల్ 56, బీసీ మహిళా 61, బీసీ జనరల్ 75, అన్ రిజర్వ్ మహిళా 122, అన్ రిజర్వ్ జనరల్ 131 స్థానాలుగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు. అదే విధంగా 4508 వార్డులకు గాను ఎస్టీ మహిళా 77, ఎస్టీ జనరల్ 92, ఎస్సీ మహిళా 325, ఎస్సీ జనరల్ 524, బీసీ మహిళా 517, బీసీ జనరల్ 770, అన్ రిజర్వ్ మహిళా 995, అన్ రిజర్వ్ జనరల్ 1208 స్థానాలుగా అధికారులు రిజర్వేషన్లు ఖరారు చేశారు.

మెదక్ జిల్లాలో 492 పంచాయతీలు..

దిశ, మెదక్ ప్రతినిధి: గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు రిజర్వేషన్ లు ఖరారయ్యాయి. గతంలో వచ్చిన రిజర్వేషన్ లలో బిసి స్థానాల్లో జనరల్ కు కేటాయిస్తూ జిల్లాలో ఉన్న 492 సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్ అధికారులు ఖరారు చేశారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు ఉండగా అందులో జనరల్, బీసీ, ఎస్టీ, ఎస్సీ స్థానాలతో వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గిరిజన గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ లు ప్రకటించారు. 492 లో 113 జనరల్ స్థానాలు కేటాయించగా 103 గ్రామ పంచాయతీలు జనరల్ మహిళ కు కేటాయించారు. ఇందులో బీసీ మహిళ 49, బిసి జనరల్ 59, ఎస్టీ మహిళ 10, ఎస్టీ జనరల్ 11, ఎస్సీ మహిళా 33, ఎస్సీ జనరల్ 44 గ్రామ సర్పంచ్ స్థానాలు రిజర్వేషన్ లు కేటాయించారు. వంద శాతం ఎస్టీ లు ఉన్న 71 గిరిజన గ్రామ పంచాయతీల్లో 29 మహిళలకు, 42 జనరల్ ఎస్టీ సర్పంచ్ స్థానాలను రిజర్వేషన్ ఖరారు చేశారు. జిల్లాల్లో 492 గ్రామ పంచాయతీల్లో 4220 వార్డు స్థానాలకు సైతం రిజర్వేషన్ లను అధికారులు ఖరారు చేశారు. జనరల్ వార్డు స్థానాలు 1011, మహిళ జనరల్ 849, బీసీ మహిళ 419, బిసి జనరల్ 588, ఎస్టీ మహిళ 55, ఎస్టీ జనరల్ 123, ఎస్సీ మహిళా 335, ఎస్సీ జనరల్ 432 వార్డు స్థానాలకు రిజర్వేషన్ ప్రకటించారు. వంద శాతం ఎస్టీ తండా గ్రామ పంచాయతుల్లో 263 వార్డు స్థానాలను ఎస్టీ వార్డులుగా కేటాయించినట్టు డీపీవో యాదయ్య తెలిపారు.

Next Story