డ్రా తో వ‌రించిన స‌ర్పంచ్ ప‌ద‌వీ

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, మెద‌క్ టౌన్ : రెండో విడ‌త గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో భాగంగా మెద‌క్ మండ‌లం చీపురు దుబ్బ తండా గ్రామ స‌ర్పంచ్ గా కేతావ‌త్ సునీత

డ్రా తో వ‌రించిన స‌ర్పంచ్ ప‌ద‌వీ
X

దిశ‌, మెద‌క్ టౌన్ : రెండో విడ‌త గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో భాగంగా మెద‌క్ మండ‌లం చీపురు దుబ్బ తండా గ్రామ స‌ర్పంచ్ గా కేతావ‌త్ సునీత ల‌క్కి డ్రాలో విజ‌యం సాధించారు. కాంగ్రెస్ అభ్య‌ర్థి కే.సునీత‌, బీఆర్ఎస్ అభ్య‌ర్థి బీమిలి పోటీ చేశారు. ఆ గ్రామంలో మొత్తం 377 ఓట్లు ఉండ‌గా.. 367 ఓట్లు పోల‌య్యాయి. ఇద్ద‌రికీ 182 చొప్పున ఓట్లు వ‌చ్చాయి. రెండు ఓట్లు చెల్ల‌నివి, ఒక‌టి నోటాకి ప‌డింది. దీంతో ఇద్ద‌రికీ స‌మానంగా ఓట్లు రావ‌డంతో రిట‌ర్నింగ్ అధికారి వెంక‌ట‌య్య డ్రా తీశారు. ఈ డ్రాలో కాంగ్రెస్ అభ్య‌ర్థిని కేతావ‌త్ సునీత‌ను అదృష్టం వ‌రించింది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు.

Next Story