- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా సంగీత..
by Kodari Anjali |
పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

X
దిశ, సంగారెడ్డి: పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లలతో సహా మొత్తం 27 మందిని బదిలీ చేస్తూ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా (రెవెన్యూ) టి.యల్.సంగీత బదిలీపై ఇక్కడికి రానున్నారు. ఈమె ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా డీఆర్ఓగా పని చేస్తూ తాజాగా సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. కాగా ఇప్పటివరకు ఇక్కడ అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విభాగంలో విధులు నిర్వహించిన ఆర్.డీ.మాధురి నల్గొండ జిల్లా ఐ అండ్ సీ.ఏ.డీ స్పెషల్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
Next Story






