చిన్న వానకే సంగారెడ్డి చిత్తడి..

by Kodari Anjali |

చిన్నపాటిగా కురిసిన వర్షానికే సంగారెడ్డి పట్టణ ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి.

చిన్న వానకే సంగారెడ్డి చిత్తడి..
X

దిశ, సంగారెడ్డి: చిన్నపాటిగా కురిసిన వర్షానికే సంగారెడ్డి పట్టణ ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిండకుండా వెళ్లేందుకు సరైన చర్యలు ఏవి అధికారులు తీసుకోకపోవడంతో వర్షపు నీరు మోకాళ్ళ లోతు వచ్చి రోడ్లపై చేరుతుంది. దీంతో స్థానిక వ్యాపారస్తులు, వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు నీరు మోకాళ్ళ లోతు వచ్చి చేరాయి. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి రైతు బజార్ వరకు వర్షపు నీరు మురికి కాలువ నీటితో కలిసి రోడ్లపై ప్రవహించడంతో అక్కడి దుకాణాదారులు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. జిల్లా కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఎలా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిసారి వర్షాకాలం ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వర్షపు నీరు రోడ్లపై నిలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

Next Story