- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్మార్ట్ సిటీగా సంగారెడ్డి.. సీసీ కెమెరాల నిఘాలో మున్సిపాలిటీ
జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ ఇక నిరంతర నిఘా నీడలోకి వెళ్లనున్నది. గ్రేడ్-1 మున్సిపాలిటీగా సంగారెడ్డి కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దిశ, సంగారెడ్డి బ్యూరో: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి మున్సిపాలిటీ ఇక నిరంతర నిఘా నీడలోకి వెళ్లనున్నది. గ్రేడ్-1 మున్సిపాలిటీగా సంగారెడ్డి కొనసాగుతున్న విషయం తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని ఈ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఇందులో భాగంగానే రూ.8కోట్లతో మున్సిపాలిటీ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. 360డిగ్రీలతో పాటు నెంబర్ ప్లేట్ క్యాప్చర్ వంటి అధునాతన కెమె రాలు అమర్చుతున్నారు. పట్టణం మొత్తం 200 చోట్ల ఈ కెమెరాలు బిగించడానికి పా యింట్లు గుర్తించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి గురువారం కెమెరాల బిగింపు ప్రక్రియను ప్రారంభించారు.
38 వార్డులు, 200చోట్ల 503 కెమెరాలు
సంగారెడ్డి గ్రేడ్-1 మున్సిపాలిటీలో మొత్తం 38వార్డులున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం లక్షా 20వేల వరకు జనాభా నివాసముంటున్నది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ముంబాయి- హైదరాబాద్ జాతీయ రహదారిపై పట్టణం ఉండడంతో వేగంగా అభివృద్ది చెందుతున్నది. ఇదిలా ఉండగా హెచ్ఎండీ పరిధిలోని ఈ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న ది. ఇందులో భాగంగానే రూ.8కోట్లతో మున్సిపాలిటీ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నిధులతో 38వార్డుల్లో 200ప్రదేశాల్లో మొత్తం 503 కెమెరాలు బిగించనున్నారు. అధునాతన 360డిగ్రీల కెమెరాలు, బుల్లెట్, నెంబర్ ప్లేట్ క్యాప్చర్ కెమెరాలు ఉన్నారు. వీటిని అమర్చడంతో పట్టణంలో ఏ ఘటన జరిగినా క్షణాల్లో ఆధారాలు సేకరించడం సులువు కానున్నది. ఈ కెమెరాల బిగింపు ప్రక్రియ నెలన్నరలో పూర్తి చేసేలా వేగంగా పనులు జరుగుతున్నాయి.
ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: నిర్మలా జగ్గారెడ్డి
సంగారెడ్డి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని టీజీఐసీసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. మున్సిపాలిటీలో కెమెరాల బిగింపు ప్రక్రియను ఆమె ప్రారంభించారు. రూ.8 కోట్ల వెచ్చించి కెమెరాల బిగింపు ఏర్పాటుతో సంగారె డ్డి స్మాట్ సిటీ గా మారనున్నదన్నారు. పట్టణ పరిధిలో క్రైం రేట్ తగ్గడంతో పాటు ఏ చిన్న ఘటన జరిగినా క్షణాల్లో సమాచారం వస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించారని చెప్పారు. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి సీఎం సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో నిర్మల వెంట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డీఎస్పీ సత్తయ్య, సీఐ రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నాయి.






