వర్షాలకు పంట పొలాల్లో ఇసుక మేటలు.. దెబ్బతిన్న 440 ఎకరాల వరి పంటలు

by Nalla Sampath Reddy |

పంటకు గాను పెట్టుబడులు తెచ్చి పంట వేస్తే ప్రకృతి పగ బట్టి వేసిన పంట పొలాల్లో నీరు చేరి ఇసుక మేటలతో కప్పబడ్డాయని పొలాలను చూసిన రైతన్నలు దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోతున్నామని తెలిపారు.

వర్షాలకు పంట పొలాల్లో ఇసుక మేటలు.. దెబ్బతిన్న 440 ఎకరాల వరి పంటలు
X

దిశ, చిన్నశంకరంపేట: నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలకు మండలంలోని చెరువులు వాగులు వంకలు, కుంటలు నిండిపోయి, అలుగు పారుతున్నాయి. ఓవైపు రైతులు సంతోష పడుతూ, మరో వైపు పంటలతో నష్టపోవాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటకు గాను పెట్టుబడులు తెచ్చి పంట వేస్తే ప్రకృతి పగ బట్టి వేసిన పంట పొలాల్లో నీరు చేరి ఇసుక మేటలతో కప్పబడ్డాయని పొలాలను చూసిన రైతన్నలు దిక్కుతోచని పరిస్థితిలో ఉండిపోతున్నామని తెలిపారు. కాగా మండలంలో గవ్వల పల్లి, ఎస్. కొండాపూర్, మడూర్, టీ. మాందాపూర్, రుద్రారం, చందంపేట, సూరారం, ధర్పల్లి, ఖాజాపూర్, సిరిపల్లి, తదితర గ్రామాలలో వరి పంటలు నీటిలో మునిగిపోయి, వర్షాలు పడి కుంట చెరువులు నిండి పంట పొలాలు బాగా పండుతాయని ఆశించిన రైతాంగానికి పెద్ద షాక్ తగిలింది.

Next Story