పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి

by Taduka Kalyani |

పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి అని ఆయన జీవిత చరిత్ర తెలియజేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు

పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి
X

దిశ,సంగారెడ్డి అర్బన్: పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి అని ఆయన జీవిత చరిత్ర తెలియజేస్తుందని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలో శ్రీ భగీరథ మహర్షి జయంతి వేడుకలను సగర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. శ్రీ భగీరథుని చరిత్ర పట్టుదల, త్యాగం, దీక్షతో అసాధ్యాన్ని సాధించగల సమర్థత గురించి ప్రజలకు బోధిస్తుందన్నారు. ఇలాంటి మహనీయులజయంతులను జరుపుకోవడం ద్వారా యువతలో సాహసం, సేవ, సామాజిక దృష్టిని పెంచే వేదికగా ఉపయోగపడుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా సగర సంఘం సీనియర్ నాయకులు సదాశివపేట్ బుకిని అశోక్ ,సంగారెడ్డి శెట్టి రవి కుమార్ సాగర్, దుంపల రామనారాయణ, మండల శివకుమార్, కొవ్వూరు శ్రీనివాసగర, ప్రవీణ్ సగర, నర్సింలు సగర, నాగరాజ్ సగర, వెంకటేష్ సగర, దుర్గయ్య సగర, కొవ్వూరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Next Story