- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సదాశివపేట మున్సిపల్ కో ఆప్షన్ అభ్యర్థుల ఎన్నిక..
సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో స్పెషల్ నాలెడ్జి కేటగిరి కింద శనివారం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు.

దిశ, సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మున్సిపాలిటీలో స్పెషల్ నాలెడ్జి కేటగిరి కింద శనివారం కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీ ఐఐసీ చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. ఎన్నిక ప్రక్రియలో హాజరైన కౌన్సిల్ సభ్యులు స్పెషల్ కేటగిరీలో మునిపల్లి సత్యనారాయణ, ఆగమామిడి అనంతమ్మ, మైనారిటీ కేటగిరీలో మహమ్మద్ రహమత్, షేక్ సుల్తానాలను ఎన్నుకున్నారు. సదాశివపేట మున్సిపల్ పాలకవర్గంలో ఛైర్ పర్సన్‌గా మునిపల్లి అంజమ్మ ఉండగా, భర్త మునిపల్లి సత్యనారాయణ కో ఆప్షన్ మెంబెర్‌గా ఎన్నుకున్నారు. ఒకే ఇంట్లో ఒకరు ఛైర్ పర్సన్, మరొకరు కో ఆప్షన్ మెంబెర్‌గా ఎన్నుకోవడం విశేషం. ఈ ఎన్నిక ప్రక్రియ పూర్తి పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం నిర్వహించబడినదని చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ తెలిపారు. ఎన్నికైన సభ్యులు మున్సిపల్ పరిపాలనలో భాగస్వాములై ప్రజాసేవలో భాగస్వాములు కావాలని సూచించారు. అనంతరం కో-ఆప్షన్ సభ్యులకు నియమక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కమీషనర్ శివాజి, ఛైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ, వైస్ ఛైర్ పర్సన్ రేణుక చిరు, కౌన్సిల్ సభ్యులు పాల్గొన్నారు.






