- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముగిసిన అపురూప ప్రయాణం..!
ఆర్టీసీలో ముప్పై నాలుగేళ్ల నిష్కళంక సేవలకు తండ్రి ముగింపు పలికారు. తండ్రి స్టీరింగ్ పడితే.. కొడుకు టికెట్లు ఇచ్చే అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.

దిశ, హుస్నాబాద్ : ఆర్టీసీలో ముప్పై నాలుగేళ్ల నిష్కళంక సేవలకు తండ్రి ముగింపు పలికారు. తండ్రి స్టీరింగ్ పడితే.. కొడుకు టికెట్లు ఇచ్చే అరుదైన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇవాళ బదనాపురం ఎల్లయ్య పదవీ విరమణ చేశారు. హుస్నాబాద్ డిపోలో జరిగిన వీడ్కోలు సమావేశంలో ఆయనను అధికారులు ఘనంగా సత్కరించారు. ఎల్లయ్య తన సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కడా అపశ్రుతి దొర్లకుండా రికార్డు సృష్టించారు. ఆయన ప్రతిభకు నిదర్శనంగా 8 ఉత్తమ డ్రైవర్ అవార్డులు, ప్రమాద రహిత ప్రయాణానికి 4 సేఫ్ డ్రైవింగ్ అవార్డులు వరించాయి.
ఆయన క్రమశిక్షణే తనను ఈ స్థాయికి చేర్చిందని సహచరులు కొనియాడారు. తండ్రి డ్రైవర్‌గా ఉండగా, కుమారుడు గణేష్ కండక్టర్‌గా అదే బస్సులో విధులు నిర్వహించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. "నాన్నతో కలిసి ప్రయాణించడం గర్వంగా ఉందని" గణేష్ భావోద్వేగానికి లోనయ్యారు. ఒక తరం సేవలు ముగిసినా, అదే బాధ్యతను కొడుకు రూపంలో ఆర్టీసీ కొనసాగిస్తోంది. నిబద్ధత గల సారథిగా ఎల్లయ్య ప్రయాణం ఎందరికో ఆదర్శం.






