అందోలు-జోగిపేట మున్సిపల్‌ అభివృద్దికి రూ.15 కోట్లు మంజూరు

by Kodari Anjali |

అందోలు-జోగిపేట మున్సిపాలిటీలోని పలు అభివృద్ది పనులకు గాను ప్రభుత్వం రూ.15 కోట్లను మంజూరు చేసింది.

అందోలు-జోగిపేట మున్సిపల్‌ అభివృద్దికి రూ.15 కోట్లు మంజూరు
X

దిశ, అందోల్‌: అందోలు-జోగిపేట మున్సిపాలిటీలోని పలు అభివృద్ది పనులకు గాను ప్రభుత్వం రూ.15 కోట్లను మంజూరు చేసింది. పట్టణంలోని బహదూర్‌ ఖాన్‌ ఫంక్షన్‌ హాల్‌ నిర్మాణానికి రూ.3 కోట్లు, అందోలు–జోగిపేట మున్సిపాలిటీ మహిళ శక్తి భవనానికి రూ.1.50 కోట్లు, మదీన కమ్యూనిటీ మరమ్మత్తులకు రూ.49 లక్షలు, బాబనగర్‌ కమ్యూనిటీ భవన మరమత్తులకు రూ.49 లక్షలు, వివేకానంద పార్కు సుందరీకరణకు రూ.2 కోట్లు, గౌని నుంచి ఫైర్‌ స్టేషన్‌ వరకు అండర్‌ డ్రైనేజీ పైపులైన్‌కు రూ.2 కోట్లు, డబుల్‌ బేడ్‌ రూమ్‌ ఇండ్ల నుంచి కుమ్మరి గూడెం, సాయిబాన్‌ రోడ్డు వరకు అండర్‌ డ్రైనేజీ పైపులైన్‌కు రూ.1.52 కోట్లు, అందోలు–జోగిపేట మున్సిపాలిటీకి వెల్‌కమ్‌ అర్చిలకు రూ. 2 కోట్లు, పోసానిపేట పీడబ్ల్యుడి రోడ్డు నుంచి సీసీ రోడ్డు ఆర్‌ఆర్‌ డిస్ట్రిలర్‌ కంపెనీ వరకు రూ.2 కోట్లు మొత్తం రూ.15 కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆయా పనులకు సంబంధించి త్వరలో టెండర్లను నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Next Story