రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : క‌లెక్ట‌ర్ కే. హైమావ‌తి

by Nallavelli.Anjaneyulu |

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని కలెక్టర్ కే హైమావతి సూచించారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించాలి : క‌లెక్ట‌ర్ కే. హైమావ‌తి
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రతి పౌరుడు రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని కలెక్టర్ కే హైమావతి సూచించారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు -2026 సడక్ సురక్ష అభియాన్ పురస్కరించుకొని గురువారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో రహదారి భద్రతా మాసోత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావ‌తి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారి భద్రత మాసోత్సవాలు జనవరి 1 నుంచి జనవరి 31 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పౌరుడు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ రోడ్డుపై ప్రయాణించే ప్రతి ఒక్క వాహనదారుడు సకాలంలో క్షేమంగా ఇంటికి చేరడమే ముఖ్య ఉద్దేశం అన్నారు. విద్యాసంస్థల్లో, కళాశాలలో రోడ్డు భద్రత నియమాల గూర్చి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా ద్విచక్ర వాహనదారులకు జరుగుతున్నందున వాహన దారులు నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించడం, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండడం, రోడ్ల పై ఉన్న వివిధ సిగ్నల్, మార్కింగ్ గురించి తెలుసుకొని జాగ్రత్తగా ప్రయాణం చేయాలని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ప్రతి అధికారి పనిచేయాలని ఆదేశించారు. అనంతరం రోడ్డు భద్రత మాసోత్సవాల సంబంధించి ప్రతిజ్ఞ ను అధికారులు అందరితో చేయించి కరపత్రం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదన కలెక్టర్ అబ్దుల్ హమీద్, మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్లు, ఆర్టీఏ కమిటీ సభ్యుడు సూర్య వర్మ, జిల్లా అధికారులు పాల్గొన్నారు

Next Story