కమీషన్లు కేసులు ఢిల్లీకి మూటలు మోసడే రేవంత్ పని : సిద్ధిపేట ఎమ్మెల్యే

by Chintha Aamani |

కమీషన్లు,కేసులు ఢిల్లీకి మూటలు మోసుడే సీఎం రేవంత్ పని అని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు.

కమీషన్లు కేసులు ఢిల్లీకి మూటలు మోసడే రేవంత్ పని :  సిద్ధిపేట ఎమ్మెల్యే
X

దిశ, నర్సాపూర్ : కమీషన్లు,కేసులు ఢిల్లీకి మూటలు మోసుడే సీఎం రేవంత్ పని అని మాజీ మంత్రి సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. గురువారం నర్సాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని రెండేళ్లయినా ఎగ్గు టెండర్లు ఫైనల్ కాలేదని ఆరోపించారు. 20 నెలల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టుడే పని పెట్టుకున్నావని సొంత పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తిడుతున్నాడని అన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి తెచ్చుకోవాలని కోరారు. 9 నెలల నుంచి మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు రాక అప్పుల పాలయ్యారని ఆరోపించారు. మేడిగడ్డను ఎండబెట్టి గురుదక్షిణగా బంకచెర్లకు నీరు పారిస్తున్నారని తెలిపాడు. కేవలం మాటలకే పరిమితమై వాటితోనే కాలం గడుపుతున్నాడని ఆరోపించారు. మొదట వృద్ధులకు పెన్షన్ ఇచ్చి మహిళలకు తులం బంగారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సమావేశంలో ఎమ్మెల్యేలు సునీత రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Next Story