- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి చెలగాటం : ఎమ్మెల్యే
విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చందా ప్రభాకర్ మండిపడ్డారు

దిశ, సంగారెడ్డి : విద్యార్థుల జీవితాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని సంగారెడ్డి ఎమ్మెల్యే చందా ప్రభాకర్ మండిపడ్డారు. గ్రూప్-1 పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. లోపభూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యానికి నిరుద్యోగులు బలవుతున్నారని, సీఎం ఇప్పటికైనా కండ్లు తెరవాలని, తెలంగాణ యువతకు క్షమాపణ చెప్పాలన్నారు. గ్రూప్ 1 పరీక్ష మూల్యాంకనం లో అవకతవకలు, పరీక్ష కేంద్రాల కేటాయింపు, హాల్ టికెట్ల జారీ, పరీక్ష ఫలితాల్లో అనుమానాలు, అక్రమాల ఆరోపణల నేపథ్యంలో నేడు హైకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. లోప భూయిష్టంగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి ఈ కోర్టు తీర్పుకు మీరు చెప్పే సమాధానం ఏమిటి? అని ప్రశ్నించారు. హడావుడిగా పరీక్షలు నిర్వహించి, అవకతవకలకు పాల్పడిన నీ నిర్లక్ష్యానికి విద్యార్థులు, నిరుద్యోగులు బలవుతున్నారని విమర్శించారు. గప్పాలు కొట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి పరీక్షలు ఎలా నిర్వహించాలి అనే సోయి కూడా లేదని అన్నారు.
Read More: TG: తెలంగాణ నర్సింగ్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్






