- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. ఏడుపాయల మాజీ డైరెక్టర్లు రాజీనామా!
బీఆర్ఎస్ పార్టీకి ఏడుపాయల మాజీ డైరెక్టర్లు రాజీనామా చేశారు.

దిశ, పాపన్నపేట : బీఆర్ఎస్ పార్టీకి ఏడుపాయల మాజీ డైరెక్టర్లు రాజీనామా చేశారు. గాంధారిపల్లికి చెందిన పాశం జ్యోతి అంజిరెడ్డి, ఎల్లాపూర్ గ్రామానికి చెందిన దాసరి శ్రీధర్ రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు. సుమారు 50 నుంచి 100 మంది కార్యకర్తలు, అభిమానులతో కలిసి బుధవారం మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన తనయుడు రోహిత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఒంటెద్దు పోకడ పోతుందని, కష్టపడి పని చేస్తున్న కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు లేకపోవడం దురదృష్టకరమన్నారు. బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి ఎంతగా కృషిచేసినా గుర్తింపు లేకపోవడం బాధను కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
కుర్తివాడ గ్రామ వార్డు మెంబర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా
పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామం 9వ వార్డు మెంబర్ వడ్ల శోభారాణి మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తునప్పటికీ తగిన గుర్తింపు లేకపోవడంతోనే పార్టీకి, సంస్థాగత సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.






