- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మిషన్ భగీరథ పైప్ లైన్ కు మరమ్మతు.. దిశ ఎఫెక్ట్
'పగిలిన భగీరథ పైప్ లైన్' అనే శీర్షికతో దిశ దినపత్రికలో సోమవారం నాడు ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. పైప్ లైన్ మరమ్మతుకు అధికారులు స్పందించారు.

X
దిశ, అల్లాదుర్గం : 'పగిలిన భగీరథ పైప్ లైన్' అనే శీర్షికతో దిశ దినపత్రికలో సోమవారం నాడు ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. పైప్ లైన్ మరమ్మతుకు అధికారులు స్పందించారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం చిల్వర్ గ్రామ సమీపంలో ఆదివారం నాడు పగిలిన పైప్ లైన్ కారణంగా నీరు వృథా పోతున్న విషయాన్ని దిశ వెలుగులోకి తీసుకొచ్చింది. జేసీబీ సహాయంతో మరమ్మత్తు పనులను శరవేగంగా కొనసాగుతున్నాయి. 50 రోజుల్లోనే రెండు సార్లు పైప్ లైన్ పగలడంతో చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు భయానికి గురవుతున్నారు. ప్రస్తుతం చేపడుతున్న మరమ్మతు పనులను పకడ్బందీగా చేపట్టి భవిష్యత్లు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Next Story






