చిట్కూల్ లో వెల్లువిరిసిన మ‌త సామ‌ర‌స్యం..!

by Nallavelli.Anjaneyulu |

కులం, మతం ఏదైనా మానవత్వం ఒక్కటేనని, భారతీయులందరూ సోదరభావంతో మెలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ చార్జి నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు. శ

చిట్కూల్ లో వెల్లువిరిసిన మ‌త సామ‌ర‌స్యం..!
X

దిశ, పటాన్ చెరు టౌన్ : కులం, మతం ఏదైనా మానవత్వం ఒక్కటేనని, భారతీయులందరూ సోదరభావంతో మెలగాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ చార్జి నీలం మధు ముదిరాజ్ పేర్కొన్నారు. శనివారం రంజాన్ పండుగ పురస్కరించుకుని చిట్కుల్ మైనార్టీ సోదరులు నీలం మధు ముదిరాజ్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒక అరుదైన ఘటన కు చిట్కుల్ గ్రామం వేదికగా నిలిచింది. నీలం మధు ముదిరాజ్ ఆధ్వర్యంలో చిట్కుల్‌లో జరుగుతున్న నూతన శ్రీ రామచంద్రస్వామి ఆలయ ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్న వేదిక వద్ద పూజా పనుల్లో నిమగ్నమై ఉన్న నీలం మధును పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులు మర్యాద పూర్వకంగా కలిశారు. హిందూ ధర్మ సంప్రదాయాల ప్రకారం.. దేవాలయ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న తరుణంలో సంప్రదాయ దుస్తులలో ఉన్న నీలం మధు వద్దకు ముస్లిం సోదరులు చేరుకోవడం మత సామరస్యానికి అద్దం పట్టింది. వారిని సాదరంగా ఆహ్వానించిన నీలం మధు, ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.


ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ, పండుగలు ఏవైనా అవి మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి, ప్రేమాభిమానాలను పెంచేవిగా ఉండాలని ఆకాంక్షించారు. ఒకవైపు రామాలయ పునఃప్రతిష్ట జరుగుతుండగా, అదే సమయంలో ముస్లిం సోదరులు వచ్చి రంజాన్ శుభాకాంక్షలు పంచుకోవడం గంగా-జమునా తెహజీబ్‌కు నిదర్శనమని ఆయన కొనియాడారు. భక్తి మార్గాలు వేరైనా లక్ష్యం ఒక్కటేనని, అందరూ కలిసిమెలిసి ఉన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేవాలయ ప్రాంగణంలో చోటుచేసుకున్న ఈ ఆత్మీయ కలయిక స్థానికుల్లో అమితమైన ఆనందాన్ని నింపింది. రాజకీయాలకు అతీతంగా, అందరినీ కలుపుకుని పోయే నీలం మధు తీరును గ్రామస్తులు, ముస్లిం పెద్దలు ప్రశంసించారు.

Next Story