- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెదక్ కు రెడ్ అలర్ట్.. రేపు స్కూళ్లకు సెలవు
మెదక్ జిల్లాలో నిన్నటి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : మెదక్ జిల్లాలో నిన్నటి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీ వరదలతో అనేక తండాలు నీటిలో మునిగిపోగా.. రోడ్లు, రైల్వే ట్రాకులు కొట్టుకు పోయాయి. మెదక్ లో హవేలీ ఘనపూర్, రామాయంపేట, చేగుంట, నార్సింగి, మెదక్ పట్టణం, మాసాయిపేట మండలాల్లో అతిభారీ వర్షం కురవక జనజీవనం అస్తవ్యస్తం అయింది. కాగా ఈరోజు రాత్రి, రేపు కూడా జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయింది.
ముందుస్తు జాగ్రత్తగా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. కలెక్టర్ ఆదేశాలతో ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్ళు, కాలేజీలకు హాలిడే ఇస్తున్నట్టు డీఎవో ఉత్తర్వులు జారీ చేసారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని విద్యాసంస్థలకు కూడా రేపు సెలవు ప్రకటించారు.






