- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధిత మహిళలకు, చిన్నారులకు భరోసా.. సఖి కేంద్రాలు : మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.1.18 కోట్లతో సఖి, భరోసా భవనాల నిర్మించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : సిద్దిపేట జిల్లా కేంద్రంలో రూ.1.18 కోట్లతో సఖి, భరోసా భవనాల నిర్మించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. చిన్న పిల్లలపై అఘాయిత్యాలు, మహిళలపై అత్యాచారాలు, దాడులు జరిగినపుడు ఇలాంటి భవనాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సఖి, భరోసా భవనాలను డిజిపి అంజన్ కుమార్‌తో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆలోచనలను పోలీస్ డిపార్ట్ మెంట్ తుచా తప్పకుండా పాటిస్తుంది అన్నారు. ఆకర్షణ సఖి, భరోసా లైబ్రరీరికి 780 బుక్స్ పంపిణీ చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
డీజీపీ అంజన్ కుమార్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ సారధ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం కమిట్ మెంట్‌తో పనిచేస్తుందన్నారు. భరోసా, సఖిలాంటి ప్రభుత్వ పథకాలు ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఈ సెంటర్లు మహిళలకు, చిన్న పిల్లలకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అడిషనల్ డీజీపీ ఉమెన్ సేఫ్టీ శిఖా గోయల్ మాట్లాడుతూ... ప్రజాభద్రతలో హైదరాబాద్ అగ్రభాగాన నిలిచిందన్నారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఐజీ రమేష్, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.






