- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్ లోనే అసలైన స్వేచ్ఛ
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 60వ జన్మదిన వేడుకలు సంగారెడ్డిలో అంబరాన్నంటాయి.

దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి 60వ జన్మదిన వేడుకలు సంగారెడ్డిలో అంబరాన్నంటాయి. ఇదే రోజు తన కూతురు జయరెడ్డి పుట్టినరోజు కూడా కావడం విశేషం. జగ్గారెడ్డి, తన కూతురు జయారెడ్డి బర్త్డే సందర్భంగా స్థానిక ఐబీ వద్ద భారీ స్థాయిలో ఎల్ఈడి స్క్రీన్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అక్కడే అభిమానులు, కార్యకర్తలు, నాయకుల మధ్య వారు ఇద్దరూ కేకును కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
కాంగ్రెస్ లోనే నిజమైన స్వేచ్ఛ
తన పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకొని జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంతో తేడా ఉందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. గతంలో కలెక్టర్ ను కలవాలంటే పోలీసులు ఆపేవారని, కానీ తమ ప్రభుత్వంలో కలెక్టర్ ను కలిసి సమస్య చెప్పుకునే అవకాశం ప్రజలకు నేరుగా ఉందన్నారు. ఇకపోతే కాంగ్రెస్ లోనే నిజమైన స్వేచ్ఛ ఉంటుందని, సమస్యలు చెప్పుకొని పరిష్కరించుకునే అవకాశం తమ పార్టీలోనే ఉందని ఆయన అన్నారు. ఇదిలా ఉంటే చిన్నప్పటినుంచి తనకు అందరికీ సేవాగుణం చేసే అలవాటు తన అమ్మ జమాయమ్మ తన తండ్రి జగ్గారెడ్డి ద్వారా వచ్చిందని ఆయన చెప్పారు. ఆ సేవా గుణాన్ని చూసే తనకు జగ్గారెడ్డి పేరు తన స్నేహితులు పెట్టారన్నారు. రాజకీయంగా సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మీనాక్షి నాయకత్వంలో మంత్రులందరి సహకారం తనకు ఉందన్నారు. జన్మదిన వేడుకల్లో భాగంగా జగ్గారెడ్డి తన కూతురు జయరెడ్డి తో కలిసి పాటలకు ప్రత్యేకంగా స్టెప్పులు వేశారు. అలాగే అభిమానుల మధ్యలో కేక్ కట్ చేసిన ఆయన వారితో కలిసి కూడా డాన్సులు వేశారు.






