ఉమ్మడి జిల్లాలో 9,53,589 మంది రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా!

by Ajay Maddhiboyina |

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు అందించింది. 54 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

ఉమ్మడి జిల్లాలో 9,53,589 మంది రైతుల ఖాతాల్లోకి  రైతు భరోసా!
X

దిశ, సంగారెడ్డి బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులు అందించింది. 54 ఎకరాల వరకు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమచేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాల్లో రూ.998.32 కోట్లు రైతుల ఖాతాల్లో భరోసా నిధులు జమ అయినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా అందోలు నియోజకవర్గంలో రూ.133.79 కోట్లు, అతి తక్కువగా పట్టణ ప్రాంతమైన పటాన్ చెరు సెగ్మెంట్ లో రూ.18.24 కోట్లు రైతులకు అందాయి. పూర్తి స్థాయిలో రైతులకు భరోసా నిధులు అందడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు భరోసా వివరాలు ఇలా..

జిల్లా రైతులు అమౌంట్(రూపాయాల్లో)

సంగారెడ్డి: 3,61,027 4,18,50,72,770

సిద్దిపేట: 3,25,888 3,57,12,21,488

మెదక్: 2,66,674 2,22,69,21,407

మొత్తం: 9,53,589 9,98,32,15,665

* 9.53 లక్షల మంది రైతులకు...

ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 9,53,589 రైతులు రైతు భరోసా పొందారు. గుంట మొదలుకుని 54 ఎకరాల వరకు ప్రతి రైతుకు రైతు భరోసా అందినట్లు అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.998.32 కోట్లు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. అధికంగా అందోలు సెగ్మెంట్ లో 1.24 లక్షల మంది రైతులకు రూ.133.79 కోట్లు, ఆ తరువాత నారాయణఖేడ్ లో 1.08 లక్షల మంది రైతులకు రూ.127. 49 కోట్లు, జహీరాబాద్ నియోజకవర్గంలో 80.742 మంది రైతులకు రూ.111.75 కోట్ల భరోసా అందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అధికారులు పంపిన లెక్కల ప్రకారం జిల్లాల విభాగంలో చూస్తే రూ.998.32 కోట్ల భరోసా నిధులు చూపిస్తుండగా నియోజకవర్గాల లెక్కల్లోకి వచ్చే సరికి రూ.971.79 కోట్లు లెక్క కనిపిస్తుంది. దాదాపు రూ.27 కోట్ల వరకు లెక్క జిల్లాలు, నియోజకవర్గాల్లో లెక్కల్లో తేడా కనిపిస్తున్నది. లెక్కల్లో పొరపాట్లు జరిగి ఉండవచ్చనని అధికారులు చెబుతున్నారు.

---------------------

నియోజకవర్గాల వారిగా రైతులు, వారి ఖాతాల్లో జమ అయిన రైతు భరోసా నిధుల వివరాలు ఇలా...

----------------------------------------

నియోజకవర్గం రైతులు అమౌంట్(కోట్లలో)

----------------------------------------

అందోలు: 1,24,928 133.79

దుబ్బాక: 97,087 91.88

గజ్వేల్: 1,06,375 102.74

హుస్నాబాద్: 90,808 108.31

మెదక్: 89,686 73.55

నారాయణఖేడ్: 1,08,101 127.49

నర్సాపూర్: 1,12,172 95.14

పటాన్ చెరు: 22,448 18.24

సంగారెడ్డి: 55,901 54.45

సిద్దిపేట: 64,035 74.45

జహీరాబాద్: 80,742 111.75

--------------------------------------

మొత్తం: 9,52,283 971.79

Next Story