ఆ క్రేజీ సంస్థ చేతికి 'ఓ..! సుకుమారి' తెలంగాణ.. ఉత్తరాంధ్ర హక్కులు

by Pulgam srinivas |

'ఓ.! సుకుమారి' తెలంగాణ, ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులను ఎస్‌వీసీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ సొంతం చేసుకున్నట్లు సమాచారం.

ఆ క్రేజీ సంస్థ చేతికి ఓ..! సుకుమారి తెలంగాణ.. ఉత్తరాంధ్ర హక్కులు
X

దిశ, వెబ్ డెస్క్: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన 'ఓ.! సుకుమారి' చిత్రానికి భరత్ దర్శన్ దర్శకత్వం వహించారు. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మించిన ఈ చిత్రానికి భరత్ మంచీరాజు సంగీతం అందించారు. ఈ సినిమా జూలై 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చిత్రబృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన తెలంగాణ, ఉత్తరాంధ్ర థియేట్రికల్ హక్కులను ఎస్‌వీసీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ దక్కించుకున్నట్లు సమాచారం.

ఈ సంస్థ అధినేత దిల్ రాజుకు తెలంగాణ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ ఉండటంతో చిత్రానికి ఈ ప్రాంతాల్లో భారీ స్థాయిలో థియేటర్లు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే సినిమా విడుదల తర్వాత మంచి టాక్‌ను సొంతం చేసుకుంటే తెలంగాణ, ఉత్తరాంధ్ర నుంచి మంచి వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి 'ఓ.! సుకుమారి' బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని నమోదు చేస్తుందో చూడాలి.

Next Story