- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనిల్ రావిపూడికి చెప్పి మరీ... సంక్రాంతికి తన సినిమాను దింపుతున్న దిల్ రాజు
వచ్చే సంక్రాంతికి తమ సినిమా ఉండనున్న విషయాన్ని దిల్ రాజు, అనిల్ కి ముందుగానే సూచించినట్లు సమాచారం.

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, స్టార్ నిర్మాత దిల్ రాజు మధ్య మంచి సన్నిహిత్యం ఉందనే విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇటీవల కాలంలో అనిల్ రావిపూడి తన చిత్రాలను వరుసగా సంక్రాంతి బరిలోకి తీసుకువస్తుండగా, దిల్ రాజు కూడా ఎక్కువగా తన సినిమాలను సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి వీరిద్దరి సినిమాల మధ్య ఆసక్తికరమైన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా, కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా ఓ చిత్రం తెరకెక్కుతోంది.
ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు రవితేజ, శ్రీ విష్ణు హీరోలుగా హాసిత్ గోలి దర్శకత్వంలో దిల్ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాను కూడా సంక్రాంతి బరిలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీంతో తమ సినిమాను కూడా సంక్రాంతికి విడుదల చేయనున్న విషయాన్ని దిల్ రాజు ముందుగానే అనిల్ రావిపూడికి తెలియజేసినట్లు, దానికి అనిల్ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధం దృష్ట్యా ఎలాంటి అపోహలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతోనే దిల్ రాజు ముందుగానే ఈ విషయాన్ని తెలియజేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి, దిల్ రాజు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆరోగ్యకరమైన పోటీలో నిలవనున్నట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి.






