తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు

by Naga Rani Yarlagadda |

తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం ఉదయానికి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ ఫుల్లయ్యాయి.

తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్.. శ్రీవారి దర్శనానికి 24 గంటలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో వీకెండ్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం ఉదయానికి శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోగా.. సేవాసదన్ వరకూ భక్తులు క్యూ లైన్లో వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల తర్వాతి నుంచి ఎలాంటి టోకెన్ లేకుండా సర్వదర్శనానికి వెళ్లే భక్తులకు స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ వెల్లడించింది. రూ.300 శీఘ్రదర్శనానికి 3-5 గంటలు, సర్వదర్శనం, దివ్యదర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 5-7 గంటల సమయం పడుతుందని పేర్కొంది. నిన్న (శనివారం) స్వామివారిని 92,017 మంది భక్తులు దర్శించుకోగా.. 47,949 మంది భక్తులు స్వామివారికి తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు వివిధ రూపాల్లో సమర్పించిన కానుకలతో స్వామివారి హుండీ ఆదాయం రూ.3.93 కోట్లు సమకూరినట్లు వివరించింది. ఇక భక్తులకు 4.63 లక్షల లడ్డూలు విక్రయించగా.. 3.23 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలు స్వీకరించారు. కాగా.. నిన్న మధ్యాహ్నం భక్తుల రద్దీ అమాంతం పెరగడంతో కొద్దిగంటలపాటు టీటీడీ అధికారులు క్యూలైన్ ను నిలిపివేశారు. కంపార్టుమెంట్లలో భక్తుల దర్శనాలు అయ్యాక.. తిరిగి క్యూలైన్లోకి భక్తులకు ఎంట్రీ ఓపెన్ చేశారు.

Next Story