భార్య వెళ్లిపోయిందని పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి

by Ajay Maddhiboyina |

భార్య ఇంటి నుండి వెళ్లిపోయిందనే మనస్తాపంతో ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై సమీపంలోని సవేరియార్ పురంలో చోటు చేసుకుంది.

భార్య వెళ్లిపోయిందని పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్న తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్: భార్య ఇంటి నుండి వెళ్లిపోయిందనే మనస్తాపంతో ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు కరెంట్ షాక్ ఇచ్చి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులోని పుదుక్కొట్టై సమీపంలోని సవేరియార్ పురంలో చోటు చేసుకుంది. సవేరియార్ పురంకు చెందిన మరియా మైఖెల్, సబితా రోనికా దంపతులు. మైఖెల్ లారీ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా సబితా రోనికా ఇంట్లోనే ఉంటూ కుటుంబాన్ని చూసుకుంటోంది. వీరికి కుమార్తె నిరోష, కుమారుడు కెనిస్టన్ ఉన్నారు.

అయితే గత కొంతకాలంగా భార్య భర్తల మధ్య కలహాలు రావడంతో ఆరు నెలల క్రితం సబిత భర్తను, పిల్లలను విడిచిపెట్టి ఇంటి నుండి వెళ్లిపోయింది. దాంతో భర్త మైఖెల్ తీవ్ర మనస్తాపినికి గురయ్యాడు. ఆ డిప్రెషన్ తో ఇక బతకడం వృథా అని నిర్ణ‌యించుకుని పిల్ల‌ల‌ను చంపేసి తాను కూడా చ‌నిపోవాల‌ని అనుకున్నాడు. ఈ క్ర‌మంలోనే నిద్ర‌లో ఉన్న 14ఏళ్ల కుమార్తె, 12 ఏళ్ల కుమారుడికి క‌రెంట్ షాక్ ఇచ్చి హ‌త్య చేశాడు. అనంత‌రం తాను సైతం విద్యుత్ షాక్ తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.

Next Story