అర్ధరాత్రి పేకాట స్థావరం పై దాడి.. 8 మంది అరెస్ట్

by Batti.Sumithra |

అర్దరాత్రి పేకాట స్థావరం పై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు.

అర్ధరాత్రి పేకాట స్థావరం పై దాడి.. 8 మంది అరెస్ట్
X

దిశ, తూప్రాన్ : అర్దరాత్రి పేకాట స్థావరం పై దాడి చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నట్టు ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మనోహరాబాద్ మండలం కల్లకల్ లో కొత్తకాపు వెంకటేష్ ఇంట్లో ఓ రూమ్ అద్దెకు తీసుకుని కొంతమంది వ్యక్తులు పేకాట ఆడుతున్నారు. నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో దాడి చేసి 8 మందిని పేకాట రాయుళ్లని, వారి నుండి 62,490 రూపాయల నగదు, 8 మొబైల్ ఫోన్లు, 5 కార్లు, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఈ ఘటన పై కేసునమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story