- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్టీసీ బస్సులో మంటలు.. కిటికీల నుంచి దూకేసిన ప్రయాణికులు
by Vemula.Srinu Prasad |
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి వద్ద ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగాయి. జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్లుండగా ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో నుంచి వస్తున్న మంటలను డ్రైవర్ గమనించి వెంటనే దిగిపోయారు..

X
దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా(NTR District) గొల్లపూడి(Gollapudi) వద్ద ఆర్టీసీ బస్సు(RTC Bus)లో మంటలు(Fire) చెలరేగాయి. జగ్గయ్యపేట(Jaggaiah Pet) నుంచి విజయవాడ(Vijayawada) వెళ్లుండగా ఆర్టీసీ బస్సు ఇంజిన్‌లో నుంచి వస్తున్న మంటలను డ్రైవర్ గమనించారు. వెంటనే బస్సును నిలిపివేశారు. అటు ప్రయాణికులు సైతం అప్రమత్తమయ్యారు. కిటికీల నుంచి బయటకు దూకేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బస్సులో చెలరేగిన మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఘటనపై కేసు నమోదు చేసి బస్సు రన్నింగ్ ఉండగా జరగడంతో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గత కారణాలు తెలుసుకుంటున్నారు.
Next Story






