సంగారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం

by Muthe.Rajitha |

సంగారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన తీవ్ర దుమారం రేపింది.

సంగారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
X

దిశ, వెబ్ డెస్క్ : సంగారెడ్డి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన తీవ్ర దుమారం రేపింది. కాలేజీలో ర్యాగింగ్ చేయడమే కాదు, ఆ ర్యాగింగ్ ను ప్రశ్నించిన స్టూడెంట్ ఇంటిపై 50 మంది సీనియర్ విద్యార్థులు దాడికి దిగడం సంచలనం సృష్టించింది. బుధవారం కాలేజీ క్యాంపస్ ఆవరణలో మొదటి సంవత్సరం స్టూడెంట్ ను కొంతమంది సీనియర్స్ ర్యాగింగ్ చేసారు. ర్యాగింగ్ పై ఎదురు తిరిగినందుకు సీనియర్స్ 50 మంది దాకా ఆ స్టూడెంట్ ఇంటిపై దాడికి దిగారు.

బాధితుడి సోదరుడు కూడా ర్యాగింగ్ పై సీనియర్స్ ను నిలదీయడంతో కొద్దిసేపు అక్కడ తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ర్యాగింగ్‌పై ప్రశ్నించినందుకు సీనియర్లు ఇలా ఇంటి మీదికి వెళ్లి దాడికి పాల్పడడం పట్టణంలో తీవ్ర కలకలం రేపింది. కాగా ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలియజేసారు.

Next Story