నారిజ ప్రాజెక్టు పనుల్లో జాప్యం.. అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే

by Sathputhe Rajesh |

దిశ, ఝరాసంగం: నారింజ ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు కేటాయించాలని, కెనాల్ వద్ద

నారిజ ప్రాజెక్టు పనుల్లో జాప్యం.. అసెంబ్లీలో లేవనెత్తిన ఎమ్మెల్యే
X

దిశ, ఝరాసంగం: నారింజ ప్రాజెక్టు ఆధునీకరణకు నిధులు కేటాయించాలని, కెనాల్ వద్ద నాలుగు చెక్ డ్యాములు నిర్మించి సాగునీటి వసతులు కల్పించాలని జహిరాబాద్ ఎమ్మెల్యే మాణిక్ రావు అసెంబ్లీలో ప్రస్తావించారు. జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్ కల్ ,ఝరాసంగం జహీరాబాద్, మొగుడంపల్లీ మండలాలకు ఉపయోగపడే నారింజ ప్రాజెక్టును 1965 -70 మధ్య కాలంలో ప్రాజెక్టు నిర్మించడానికి సుమారు 650 ఎకరాల భూమిని సేకరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు మూడు నుంచి నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందుతుందనె లక్ష్యంతో, మూడు టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించారు. 1970 డిసెంబర్ లో ప్రాజెక్టు పూర్తి చేశారు. కోహీర్ మండలంలోని పుట్టి, ఝరాసంగం మండలం మీదుగా జహిరాబాద్ నియోజకవర్గంలోని కొత్తుర్ (బి) నిర్మించిన నారింజ ప్రాజెక్టు కింద రెండు కెనాల్ లు కలవు. కుడి కెనాల్ ద్వారా 3500 ఎకరాలు, ఎడమ ఛానల్ ద్వారా 500 ఎకరాలకు సాగునీటి వసతులు కల్పించవచ్చు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్థానిక మంత్రి హరీష్ రావు దీనిపై సమీక్ష జరిపించి తగిన నిధులు కేటాయించినా పనిలో మాత్రం తీవ్రమైన జాప్యం జరుగుతుంది. ప్రాజెక్టులో విపరీతంగా మట్టికూరుకు పోయి,ప్రాజెక్టు గేట్లు లీకేజీ ఏర్పడటం వల్ల నీరు వృధాగా వెళ్ళి కర్ణాటకలోని కరింజ డ్యామ్ లో కలుస్తుంది. మూడు టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం అర టీఎంసీకి మాత్రమే పరిమితం అయింది. నారింజ నీటిని సరైన విధంగా ఉపయోగించుకుంటే జహీరాబాద్ నియోజకవర్గంలోని 14 గ్రామాలకు ప్రత్యక్షంగా, సుమారు 60 గ్రామాలకు పరోక్షంగా సాగునీరు అందించవచ్చు. ఇక్కడి నుండి వృధాగా పోయిన నీరు కర్ణాటకలోని కరింజ డ్యాంకు చేరి ,కారంజ డ్యాం నిండిన తర్వాత తిరిగి ఆ నీరు మంజీరా నదిలో కలుస్తుంది.

సింగూర్ డ్యాంకు మళ్లింపు ఆగిపోయింది

నారింజ డ్యాంలో వర్షాకాలంలో నిండిన నీటిని జహీరాబాద్ మండలంలోని అల్గోల్ మీదుగా ఝరాసంగం మండలంలోని మేదపల్లి కొత్త చెరుకు వరకు మళ్లింపు చేసి, అక్కడి నుండి జీర్లపల్లి దుబ్బ వాగు మీదుగా సింగూర్ డ్యాంలోకి నీటిని మళ్ళించాలని ఇంజనీర్లు ప్రతిపాదించారు. ఇది సుమారు 15 కి.మీ.ఉంటుంది. అది ప్రతిపాదనలకే మిగిలిపోయింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి ప్రాజెక్ట్ ను ఆధునీకరించి జహీరాబాద్ నియోజకవర్గ రైతులకు సాగునీరు కల్పిస్తే మొక్క జొన్న, పత్తి, చెరుకు పంట సాగు పెరిగి మీ, బీడు బంజరు భూములు సాగులోకి వస్తాయి.

మినీ ట్యాంక్ బండ్ , చెక్ డ్యాములు నిర్మించాలి: ఎమ్మెల్యే మాణిక్ రావు

నారింజ ప్రాజెక్టు కింద నాలుగు చెక్ డ్యాములు నిర్మించాలని, నారింజ వాగును మినీ ట్యాంక్ బండ్ గా మార్చి సుందరికరిస్తే జహిరాబాద్ ప్రాంతవాసులకు, ప్రాజెక్టుకు సమీపంలో ఉన్న శ్రీ సిద్ధివినాయక దేవస్థానానికి నుండే తెలుగు రాష్ట్రల భక్తులు కాకుండా కర్ణాటక, వివిధ ప్రాంతాల ప్రజలకు ఇది ఒక విహారయాత్ర గా మారుతుంది. తగిన నిధులు విడుదల చేయాలని స్థానిక ఎమ్మెల్యే మాణిక్ రావు గారు అసెంబ్లీలో ప్రస్తావించారు.

నారింజ ప్రాజెక్ట్ కు 50 కోట్లు కేటాయించాలి: నరోత్తం కాంగ్రెస్ నాయకులు

నారింజ ప్రాజెక్టు ఆధునీకరణకు మట్టి పూడికతీత , గేట్ల నవీకరణ కు 50 కోట్ల నిధులు కేటాయిస్తే నీటి నిల్వ సామర్థ్యం పెరిగి జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. తెరాస ప్రభుత్వం ఎత్తిపోతలకు చేస్తున్న ఖర్చులు కొంత భాగం నిధులు కేటాయిస్తే జహిరాబాద్ ప్రజల కల సాకారం అవుతుంది.

నారింజ ప్రాజెక్టు పై నిర్లక్ష్యం తగదు: జిల్లా బిజెవైఎం నాయకులు బీ. పాండు

జహీరాబాద్ నియోజకవర్గానికి జీవనాధారమైన నారింజ ప్రాజెక్టు పై నిర్లక్ష్యం తగదని, ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకపోతే బిజెపి రైతుల పక్షాన పోరాడుతుందని తెలిపారు.

Next Story