- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాపాలన అంటే లాఠీ చార్జీ చేయడమా
ప్రజా పాలన అంటే వరద బాధితులపై లాఠీ చార్జి చేయడమా అని కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు.

దిశ, చేగుంట : ప్రజా పాలన అంటే వరద బాధితులపై లాఠీ చార్జి చేయడమా అని కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మండిపడ్డారు. చేగుంట మండల కేంద్రంలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలతో కలిసి సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ఖమ్మంలో వర్ష బాధితులు సహాయం అడిగినందుకు పోలీసులు లాఠీ చార్జి చేయడం ప్రజాపాలన కిందికి వస్తుందా అని ప్రశ్నించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది మృతి చెందారని, ప్రభుత్వం మాత్రం ఆ లెక్కలను బయట పెట్టడం లేదని పేర్కొన్నారు. వరద బాధితులకు తక్షణమే ఆదుకోవాలని, వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
వరదల్లో చనిపోయిన వ్యక్తులకు 20 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 25 లక్షలు ఇవ్వాలన్న మీరు కేవలం 5 లక్షల రూపాయలు ఇస్తామని పేర్కొనడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ చెప్పినప్పటికీ ప్రభుత్వం సరైన సహాయ చర్యలు చేపట్టలేదన్నారు. దాంతో ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా 9 మందిని కాపాడలేకపోవడం దారుణం అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 74 సంవత్సరాలు ఉన్నప్పటికీ బయట తిరుగుతుంటే మన ముఖ్యమంత్రి మాత్రం ఇంట్లో కూర్చున్నారని ఎద్దేవా చేశారు. పార్టీపరంగా వరద బాధితులను ఆదుకోవడం కోసం ఇప్పటికే మా శ్రేణులు సిద్ధమయ్యారని పేర్కొన్నారు. మెదక్ జిల్లా నుండి కూడా వరద బాధితుల సహాయాన్ని అందజేసినట్టు వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రతిపక్షాన్ని కలుపుకొని వరద బాధితులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.






