సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల అందజేత

by Naveena |

మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్నామని మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తెలిపారు.

సబ్సిడీపై వ్యవసాయ పనిముట్ల అందజేత
X

దిశ ,చేగుంట : మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్నామని మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన మహిళా రైతులకు 50% , ఇతర రైతులకు 40% సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందించడం జరుగుతుందని తెలిపారు. చేగుంట మండలానికి 4 చేతితో నడిచే బ్యాటరీ పంపులు, 3 పవర్ స్ప్రేయర్స్, 1 రోటవేటర్, 1 విత్తనాలు ,ఎరువులు వేసే యంత్రం, 2 ట్రాక్టర్ తో నడిచే పరికరాలు, 1 ట్రాక్టర్ కేటాయించబడిందని తెలిపారు. కేవలం మహిళా రైతులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. దీని కోసం రైతులు పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ లను దరఖాస్తు ఫారం తో కలిపి మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఈనెల 28వ తేదీ లోపు ఇవ్వాలని వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తెలిపారు.మహిళా రైతులకు సబ్సిడీపై వ్యవసాయ యంత్ర పరికరాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్నామని మండల వ్యవసాయ అధికారి హరిప్రసాద్ తెలిపారు.

Next Story