- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్తి తగాదా.. తల్లిపై దాడి చేసిన కుమారుడు
ఆస్తి తగాదాలు కారణంతో కుమారుడు కన్నతల్లిపైనే దాడి చేసే స్థితికి తీసుకెళ్లిన ఘటన దుబ్బాక మండలం హసన్మీరాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

దిశ, దుబ్బాక: ఆస్తి తగాదాలు కారణంతో కుమారుడు కన్నతల్లిపైనే దాడి చేసే స్థితికి తీసుకెళ్లిన ఘటన దుబ్బాక మండలం హసన్మీరాపూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. దుబ్బాక ఎస్సై కె. కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. హసన్మీరాపూర్ గ్రామానికి చెందిన బాల్తె లక్ష్మి తన భర్త బాలయ్య, కుమారుడు మహేశ్ కుటుంబంతో కలిసి నివాసం ఉంటోంది. గత కొంతకాలంగా ఆస్తి పంపకాల విషయంలో తల్లి, కుమారుడి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ విషయమై పలుమార్లు గ్రామ పెద్దలు పంచాయతీలు నిర్వహించి రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. మంగళవారం మరోసారి ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకోగా, ఆవేశానికి లోనైన మహేశ్ కర్రతో తల్లి లక్ష్మి తలపై బలంగా దాడి చేశాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమై రక్తస్రావం జరిగింది. స్థానికులు వెంటనే బాధితురాలిని సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, వైద్యులు తలకు కుట్లు వేసి చికిత్స అందిస్తున్నారు. ఘటన సమాచారం అందుకున్న దుబ్బాక ఎస్సై కె. కీర్తిరాజు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుమారుడు మహేశ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.






