పోలింగ్ మెటీరియ‌ల్ డిస్ట్రిబ్యూష‌న్ ప్ర‌క్రియ సజావుగా జ‌ర‌పాలి : క‌లెక్ట‌ర్ హైమావ‌తి

by Nallavelli.Anjaneyulu |

ఈ నెల 11న జర‌గ‌బోయే దుబ్బాక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సజావుగా జరపాలని ఎన్నికల అధికారి కలెక్టర్ కె.హైమావతి తెలిపారు.

పోలింగ్ మెటీరియ‌ల్ డిస్ట్రిబ్యూష‌న్ ప్ర‌క్రియ సజావుగా జ‌ర‌పాలి : క‌లెక్ట‌ర్ హైమావ‌తి
X

దిశ, దుబ్బాక : ఈ నెల 11న జర‌గ‌బోయే దుబ్బాక మున్సిపల్ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ సజావుగా జరపాలని ఎన్నికల అధికారి కలెక్టర్ కె.హైమావతి తెలిపారు. 2-వ సాధారణ మున్సిపల్ ఎన్నికలు- 2026 ప్రక్రియలో భాగంగా ఆదివారం దుబ్బాక మున్సిపల్ ఎన్నికల సంబంధించి లచ్చపేట లో గల తెలంగాణ మెడల్ స్కూల్, జూనియర్ కళాశాల లో పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాల్, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లను కలెక్టర్ కె. హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ... రా|ష్ట్ర ఎన్నిక‌ల కమిషన్ నియమావళి ప్రకారం.. ఈ నెల 10 న పోలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ పోలింగ్ స్టేషన్ ల వారిగా సిబ్బందికి సజావుగా జరపాలని మధ్యాహ్నం భోజనం వసతి ఏ ఒక్కరికి చిన్న లోటు రాకుండా పగడ్బందిగా ఏర్పాట్లు చేయాల‌ని తెలిపారు. 11న పోలింగ్ స్టేషన్ లలో అన్ని వసతులు కల్పించాలని, పోలింగ్ రోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించాలని సూచించారు. అలాగే పోలింగ్ సమయం ముగిసిన తరవాత మెడల్ స్కూల్ లో రిసెప్షన్ ప్రక్రియ సైతం సజావుగా జరపాలని, పోలింగ్ సిబ్బందికి రాత్రి బోజన ఏర్పాటు చేయాల‌ని రిసెప్షన్ పూర్తి కాగానే బ్యాలెట్ బ్యాక్ లను స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని తెలిపారు. 13న కౌంటింగ్ జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో ఈనెల 12న‌ కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. 13న కౌంటింగ్ సిబ్బందికి టిఫిన్, లంచ్, టీ, డ్రింకింగ్ వాటర్ అందించాలని పాస్ లు ఉన్నవాళ్ళను మాత్రమే లోపలికి అనుమతించాలని స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ ప్రక్రియ జరిగేటప్పుడు వెబ్ కెమెరాలు ప్రతి ఒక్కటి రికార్డ్ కావాలని తెలిపారు. మొత్తం మున్సిపల్ ఎలక్షన్ ప్రక్రియ సజావుగా పూర్తి చేసే బాధ్యత మున్సిపల్ కమిషనర్ కె. రమేష్ కుమార్ ను ఆదేశించారు.

Next Story