జైలు అధికారులను బురిడీ కొట్టించిన ఖైదీ..

by Kodari Anjali |

సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఓ ఖైదీ జైలు అధికారులనే నమ్మించి చేసిన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.

జైలు అధికారులను బురిడీ కొట్టించిన ఖైదీ..
X

దిశ, సంగారెడ్డి: సంగారెడ్డి సెంట్రల్ జైలులో ఓ ఖైదీ అక్కడ ఉండే అధికారులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. జహీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనం కేసుల్లో నిందితుడుగా ఉన్న వినోద్ (24) అనే ఖైదీ జైలు లోపల ఉన్న ఆర్వో ప్లాంట్‌లో వాడే కెమికల్ రసాయనాన్ని తాగి ఆత్మహత్యాయత్నంకు ప్రయత్నించినట్లు నాటకం ఆడాడు. అది నమ్మిన జైలు అధికారులు వెంటనే అతడిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అతడికి వైద్యులు అల్ట్రా సౌండ్, ఎండోస్కోపీ, ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. అన్ని టెస్టుల్లో నార్మల్ రిజల్ట్ రావడంతో ఎలాంటి కెమికల్ సేవించలేదని వైద్యులు తేల్చి చెప్పినట్లు జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ వెల్లడించారు. కాగా వైద్య పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను కూడా జైలు అధికారులు విడుదల చేశారు.

Next Story