- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆదిమానవుల రాతి చిత్రాలు .. మంబోజిపల్లిలో వెలుగులోకి
తెలంగాణాలోని శతాధిక రాతిచిత్రాలతావులలో మంబోజిపల్లి పేరెక్కింది.. ఈ ప్రాంతంలో మానవుడి జీవనానికి స్పందించిన పలు ఆనవాళ్లను చరిత్రకారుడు బుర్ర సంతోష్ గుర్తించాడు.

దిశ, మెదక్ ప్రతినిధి : తెలంగాణాలోని శతాధిక రాతిచిత్రాలతావులలో మంబోజిపల్లి పేరెక్కింది.. ఈ ప్రాంతంలో మానవుడి జీవనానికి స్పందించిన పలు ఆనవాళ్లను చరిత్రకారుడు బుర్ర సంతోష్ గుర్తించాడు. తెలంగాణలోని మెదక్ మండలం మంబోజిపల్లి, నిజాం డక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పక్కనే ఉన్న రాళ్ల గుట్టమీద, 1800014411 ఉత్తర అక్షాంశాలు, 78015106.311 తూర్పు రేఖాంశాల పైన, 15 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పైన రాతిచిత్రాల కాన్వాస్ ను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధక సభ్యుడు బుర్ర సంతోష్ గుర్తించాడు. రెండు తాబేళ్ళు, జిగ్ జాగ్ రేఖలు, పాత్రలు 6, గొలుసుకన్నెలు ఒక వరుసలో, వెనక వేలాడే బుట్ట, చెట్టువలె కనిపిస్తున్న పొడవైన నిలువుగీతలు, నిలువుగా, అడ్డంగా రెండ్రెండు గీతలు, 4 బాణాలతీరు బొమ్మలు ఒక దిశలో, ఒక ద్వంద్వ వృత్తానికి నలువైపులా గురిచేసినవి, మరి 5 బాణాలు ఒక వృత్తంలో... ఇవన్నీ అరుదైన రాతిచిత్రాల డిజైన్లు, దీర్ఘ వృత్తాలు, వృత్తాలు, త్రిశూలం వలె, తేనెపట్టు వలె, సన్నని 8,9 గీతలతో కంఠహారం వలె కనిపించే అర్థ వృత్తం, ఇంకా అధ్యారోపణం చేయబడినవెన్నో రాతిచిత్రాలు, కొన్ని గుర్తించడానికి వీలుకాని డిజైన్లు ఈ రాతిచిత్రాలతావులో కనిపిస్తున్నాయి. రాతి చిత్రాలన్నీ ఎరుపు రంగులో గీసినవే. రంగుగాఢతను, గీతలనుబట్టి ఈ చిత్రాలలో కొన్ని పెదరాతియుగానికి, ఎక్కువమట్టుకు చారిత్రక యుగానికి చెందినవని చెప్పవచ్చని రాతిచిత్రాల నిపుణులు డా. బండి మురళీధర్ రెడ్డి, శ్రీరామోజు హరగోపాల్ అన్నారు.
క్షేత్రపరిశోధన: బుర్రా సంతోష్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు
విషయ వివరణ: శ్రీరామోజు హరగోపాల్, కన్వీనర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం






