రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

by S Gopi |   (  Updated:2022-11-26 12:39:47  IST  )

జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో ఈనెల 27 ఆదివారం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని....Power outage tomorrow

రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
X

దిశ, సంగారెడ్డి: జిల్లా కేంద్రమైన సంగారెడ్డి పట్టణంలో ఈనెల 27 ఆదివారం విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని పట్టణ విద్యుత్ శాఖ ఏఈ సంతోష్ తెలిపారు. మెయింటెనెన్స్ కారణంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ నిలిపివేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పట్టణంలోని మంజీరా నగర్, వీరభద్ర నగర్, రైతు బజార్, ప్రశాంత్ నగర్, ఎఫ్ ఆర్ ఎస్, రాజంపేట, ఇందిరా కాలనీ, డ్రైవర్స్ కాలనీ, రెవెన్యూ కాలనీ, వసంత్ నగర్, ద్వారకా నగర్, ఓడిఎఫ్ కాలనీ, బృందావన్ కాలనీ ప్రగతి నగర్ బర్మా కాలనీ, సాయి కృషినగర్, అయ్యప్ప కాలనీ, ఆదిత్య నగర్ కాలనీ, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్, అహ్మద్ నగర్, బాలాజీ నగర్, శాంతినగర్, సాయి నగర్, కల్వకుంట రోడ్, రాజీవ్ పార్క్, కొత్త బస్టాండ్ వెనకాల అంతటా విద్యుత్ అంతరాయం ఉన్నందున ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

Next Story