కేతకిలో 'ఉగ్రం' సినిమా రచయిత పూజలు

by Disha Web Desk 1 |
కేతకిలో ఉగ్రం సినిమా రచయిత పూజలు
X

దిశ, ఝరాసంగం:దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ఝరాసంగం కేతకి సంగమేశ్వర స్వామి ఆలయంలో సినీ హీరో అల్లరి నరేష్ నటించిన 'ఉగ్రం' సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కథ రచయిత వెంకట్ సంగమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ముందుగా స్వామి వారి అమృత పుష్కరిణిలో గల జల లింగానికి పూజలు నిర్వహించారు. అనంతరం పార్వతీ సమేత గమేశ్వర స్వామి వారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సినీ రచయిత వెంకట్ మాట్లాడుతూ.. ఈ నెల 5న 'ఉగ్రం' సినిమా విడుదల అవుతున్న నేపథ్యంలో సంగమేశ్వర స్వామి ఆశీస్సులతో విజయవంతం కావాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట బాలగౌడ్, శ్రీధర్ రెడ్డి, మన్నె రమేష్, నామ రవికిరణ్, పరమేశ్వర్ రెడ్డి, రాజ రమేష్, నరేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.

Next Story

Most Viewed